షకీలా ఎలిమినేట్‌.. ప్రోమోలోనే తెలిసిపోయిందిగా! | Bigg Boss 7 Telugu: Nagarjuna Fun with Contestants | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: పరువు తీసుకున్న తేజ.. ఆవిడే ఎలిమినేట్‌ అయిందా?

Sep 17 2023 3:47 PM | Updated on Sep 17 2023 4:34 PM

Bigg Boss 7 Telugu: Nagarjuna Fun with Contestants - Sakshi

కంటెస్టెంట్లు అందరూ ఎలిమినేట్‌ అయిన వ్యక్తి వెనకాల వెళ్తూ కనిపించారు. వారిలో ఎక్కడా షకీలా కనిపించలేదు. దీంతో షకీలా అమ్మ ఎలిమినేట్‌ అయిందని ఫిక్స్‌ అయిపో

బిగ్‌బాస్‌ తెలుగు 7లో మరొకరిని ఎలిమినేట్‌ చేసే సమయం ఆసన్నమైంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. రేపు గణపతి పండగ కావడంతో వినాయకుని పాటతోనే ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. కంటెస్టెంట్లతో ఈరోజు ఇంట్రస్టింగ్‌ గేమ్‌ ఆడించాడు. ఆటలో మీకు ఎవరు భళ్లాల దేవ? ఎవరు కట్టప్ప? అని ఆట ఆడించాడు. ప్రియాంక.. శివాజీని కట్టప్పగా పేర్కొంది. ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలు వెల్లడించారు.

స్క్రీన్‌పై కాస్ట్యూమ్‌ కనిపిస్తుంది. ఆ కాస్ట్యూమ్‌ చూసి అదేం సినిమానో గుర్తు చేయాలి. ఇలాంటి ఫన్‌ గేమ్‌లు ఇస్తే మనోళ్లకు తెగ సంబరం.. పోటీపడి మరీ ఆడారు. మధ్యలో తేజ ఇంద్ర సినిమాలోని చిరంజీవి వీణ స్టెప్పు వేస్తానని ట్రై చేసి తన పరువు తానే తీసుకున్నాడు. చివర్లో ఎలిమినేషన్‌ ప్రక్రియ నిర్వహించారు. ప్రశాంత్‌, షకీలా, గౌతమ్‌, శోభా శెట్టి, తేజకు కొమ్ములు పెట్టారు. అయితే అదే ప్రోమోలో షకీలా పక్కన తేజ, ప్రశాంత్‌ కొమ్ము లేకుండా కనపడ్డారు. మరో ప్రోమోలో  కంటెస్టెంట్లు అందరూ ఎలిమినేట్‌ అయిన వ్యక్తి వెనకాల వెళ్తూ కనిపించారు. వారిలో శోభా, గౌతమ్‌ ఉన్నారు. మిగిలిందల్లా షకీలా ఒక్కరే.. దీంతో షకీలా అమ్మ ఎలిమినేట్‌ అయిందని ఫిక్స్‌ అయిపోయారు అభిమానులు.

చదవండి: హర్ష సాయి హీరోగా మెగా మూవీ.. టీజర్‌ చూశారా? డైలాగులు అదిరిపోయాయి!

Advertisement
 
Advertisement
Advertisement