భూమిక, యోగిబాబు 'స్కూల్‌' మొదలైంది | Sakshi
Sakshi News home page

భూమిక, యోగిబాబు 'స్కూల్‌' మొదలైంది

Published Thu, Jan 25 2024 9:37 AM

Bhoomika And Yogi Babu New Movie Launch - Sakshi

నటి భూమిక, యోగిబాబు, దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న స్కూల్‌ చిత్రం బుధవారం చైన్నెలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. క్వాంటమ్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఆర్‌కే విద్యాధరన్‌, మంజు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను ఆర్‌ కె విద్యాధరన్‌ నిర్వహిస్తున్నాడు. బక్స్‌, శ్యామ్స్‌ ముఖ్యపాత్రలు పోసిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్యన్‌ గోవిందరాజన చాయాగ్రహణం అందిస్తున్నారు.

చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది పూర్తిగా స్కూల్‌ నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. పాఠశాలలో జరిగే అవినీతి అక్రమాలను ఆవిష్కరించే ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం స్కూల్‌ చిత్రం అని చెప్పారు. విద్యార్థుల దృష్టిలో సమాజంలో జరిగే ఆత్మహత్యలు, ప్రమాదాలు, అన్యాయాలు వంటి పలు ఆసక్తికరమైన సంఘటనతో చిత్రం సాగుతుందని చెప్పారు.

ఇందులో విద్యార్థులను శారీరక రీత్యా పరిశోధించే ప్రధాన అధ్యాపకులుగా నటి భూమిక, విద్యార్థుల సంరక్షణ బాధ్యతలను నిర్వర్తించే పాఠశాల ఉపాధ్యాయుడిగా యోగిబాబు నటించారని చెప్పారు. పాఠశాలలో జరిగే క్రైమ్‌ థ్రిల్లర్‌ అంశాలను ఇన్వెస్టిగేషన్‌ చేసి అధికారిగా దర్శకుడు కేఎస్‌రవికుమార్‌ నటించారని తెలిపారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ గురువారం నుంచి మొదలవుతుందని దర్శకుడు చెప్పారు.

Advertisement
 
Advertisement