Bhola Shankar Official Hindi Teaser - Sakshi
Sakshi News home page

Bhola Shankar: చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

Aug 15 2023 7:19 AM | Updated on Aug 15 2023 10:48 AM

Bhola Shankar Official Hindi Teaser - Sakshi

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్. ఈనెల 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించగా మెహర్ రమేష్ డైరెక్షన్‌ చేశారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.  తమిళంలో అజిత్ వేదాళం సినిమాను తెలుగులోకి రీమేక్‌ చేసి ఇక్కడి నేటివిటీకి తగినట్లుగా మెహర్ రమేష్ మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారు.  

అయితే టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ రాలేదు. కానీ ఇప్పుడు హిందీలో రిలీజ్ చేసేందుకు భోళాశంకర్ టీం సిద్ధమైంది. నిజానికి ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే హిందీలో కూడా విడుదల చేస్తామని మేకర్స్‌ ప్రకటించారు. సినిమాకు డివైడ్‌ టాక్‌ రావడంతో హిందీలో విడుదల చేయడం వాయిదా వేస్తారని అందరూ అనుకున్నారు.

(ఇదీ చదవండి: అందులో అర్ధ నగ్నంగానే నటించాను తప్పేంటి.. నా జీవితంలో అంతకు మించే జరిగాయి)

కానీ తాజాగ  హిందీలో ఆగష్టు 25వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు రైట్స్ కొనుక్కున్న సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆపై సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. చిరంజీవికి హిందీ బెల్ట్‌లో కూడా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఈ సినిమా అక్కడ విడుదల చేస్తున్నట్లు ప్రకటన రావడంతో వారు ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. మరీ హిందీలో భోళాశంకర్ ఫలితం ఎలా  ఉంటుందో తెలియాలంటే 25 వరకు ఆగాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement