Andrea Jeremiah Reveal Her Role In Vetrimaaran Movie - Sakshi
Sakshi News home page

Andrea Jeremiah: అందులో అర్ధ నగ్నంగానే నటించాను తప్పేంటి.. నా జీవితంలో అంతకు మించే జరిగాయి

Aug 15 2023 6:54 AM | Updated on Aug 15 2023 9:56 AM

Andrea Jeremiah Reveal Her Role In Vetrimaaran Movie - Sakshi

బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ నటి ఆండ్రియా. తమిళనాడుకు చెందిన ఆంగ్లో ఇండియన్‌ కుటుంబంలో పుట్టిన ఈమెకు చిన్నతనం నుంచి సంగీతంపై మక్కువ. ఆండ్రియా పియానో వాయిద్య కళాకారిణి. ఇక ఈమె న్యాయవాది అన్న విషయం చాలా మందికి తెలియదు. అదేవిధంగా నటిగా కంటే కూడా గాయనిగా ముందు సినీ రంగ ప్రవేశం చేశారు. గాయనిగా గుర్తింపు పొందిన తర్వాత కోలీవుడ్‌లో పచ్చైక్కిళి ముత్తుచ్చారం చిత్రంతో కథానాయకిగా రంగ ప్రవేశం చేశారు. 

(ఇదీ దచవండి: ముంబయికి షిఫ్ట్ అయిన ఫ్యామిలీ.. సూర్య ఏమన్నారంటే!)

ఆ తర్వాత మంగాత్తా, విశ్వరూపం,తడాఖా,మాస్టర్‌, వడచైన్నె అంటూ పలు చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించారు. మలయాళం, తమిళం, తెలుగు తదితర భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్నారు. 36 ఏళ్ల ఈ అవివాహిత భామ ఇప్పటికీ నటిగా గాయనిగా బిజీగా ఉన్నారు. కాగా ఇటీవల పుష్ప చిత్రం తమిళ్‌ వెర్షన్లో 'ఊ అంటావా మామ' పాటను పాడి ఆ పాటకు ఇక్కడ కూడా క్రేజ్‌ తెచ్చిపెట్టింది ఈమెనే. అయితే వ్యక్తిగతంగా ఈమె పలు విమర్శలను ఎదుర్కొన్నారు.

ఇటీవల దర్శకుడు వెట్రిమారన్‌ నిర్మించిన అనల్‌ మేల్‌ పణితులి చిత్రంలో ఆండ్రియా అర్ధ నగ్నంగా నటించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. దీనిపై ఇటీవల ఒక భేటీలో స్పందించిన ఆండ్రియా నిజమే ఆ చిత్రంలో ఒక సన్నివేశంలో నటిస్తున్నప్పుడు తనకే చాలా బిడియంగా అనిపించిందని అన్నారు. అయితే నిజ జీవితంలో తనకు ఇంతకు మించిన సంఘటనలను జరిగాయని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈమె పిశాచి 2, మాలిగై, నో ఎంట్రీ, బాబి ఆంటోనీ చిత్రం అంటూ అరడజను చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అదేవిధంగా తెలుగులో 'సైంధవ్‌' చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement