విశ్వంభర ‘స్పెషల్‌’.. కీరవాణి కాదు.. భీమ్స్‌! | Bheems Ceciroleo Composed Special Song For Vishwambhara | Sakshi
Sakshi News home page

‘విశ్వంభర’లో స్పెషల్‌ సాంగ్‌.. కీరవాణి కాదు భీమ్స్‌!

Jun 18 2025 1:58 PM | Updated on Jun 18 2025 5:10 PM

Bheems Ceciroleo Composed Special Song For Vishwambhara

సంగీతం దర్శకుడు కీరవాణిపై ఒక విమర్శ ఉంది. రాజమౌళి సినిమాలకు తప్ప మిగతా చిత్రాలకు సరైన పాటలు అందించరు. నేపథ్య సంగీతం కూడా ఆ స్థాయిలో ఉండదు. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత కీరవాణి పలు సినిమాలకు సంగీతం అందించినా.. ఆ స్థాయిలో పాటలు ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం ఆయన సంగీతం అందిస్తున్న చిత్రాలలో విశ్వంభర(Vishwambhara) ఒకటి. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌ కూడా ఉందంట. దాని కోసం కీరవాణిని కాకుండా యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ భీమ్స్‌ని రంగంతో దించారట మేకర్స్‌. సినిమా మొత్తానికి కీరవాణి సంగీతం అందించినా.. ఆ ఒక్క పాట మాత్రం భీమ్స్‌ కంపోజ్‌ చేస్తాడట.

కీరవాణి ఖాతాలో పలు సూపర్‌ హిట్‌ స్పెషల్‌ సాంగ్స్‌ కూడా ఉన్నాయి. అయితే అవన్నీ రాజమౌళి సినిమాలవే కావడం విశేషం. మిగతా సినిమాలకు కూడా ఐటమ్స్‌ సాంగ్‌ చేసినా అవి అంతగా ఆకట్టుకోలేదు. ఆ కారణంగానే విశ్వంభర టీమ్‌ ఆ బాధ్యతను భీమ్స్‌ అప్పగించినట్లు సమాచారం. ఇప్పుడీ యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఫుల్‌ ట్రెండ్‌లో ఉన్నాడు. చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రానికి ఆయనే సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు విశ్వంభర కోసం స్పెషల్‌ సాంగ్‌ చేయబోతున్నాడట. ఫోక్‌ సాంగ్స్, ఐటమ్‌ సాంగ్స్‌ చేయడంలో భీమ్స్‌ స్పెషలిస్ట్‌. మరి విశ్వంభర కోసం కూడా ఫోక్‌ స్టైల్లోనే స్పెషల్‌ సాంగ్‌ చేస్తాడేమో చూడాలి.

ఇక విశ్వంభర విషయానికొస్తే.. చాలా గ్యాప్‌ తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్‌ యాక్షన్‌ మూవీ ఇది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్‌, కునాల్‌ కపూర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్పెషల్‌ సాంగ్‌ మినహా షూటింగ్‌ అంతా పూర్తయింది. అన్ని కుదిరిలే ఆగస్ట్‌ నెలాఖరు లేదా సెప్టెంబర్‌ మొదటి వారంలో రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement