తగ్గేదేలే అంటోన్న టాలీవుడ్ మూవీ.. ఏకంగా ప్రపంచ రికార్డ్‌ సొంతం! | Bellamkonda Sreenivas Movie Creates World Record In Youtube | Sakshi
Sakshi News home page

Bellamkonda Sreenivas: టాలీవుడ్‌ సినిమా ప్రపంచ రికార్డ్‌.. కానీ తెలుగులో మాత్రం డిజాస్టర్‌!

Published Thu, Feb 22 2024 10:29 AM | Last Updated on Thu, Feb 22 2024 10:50 AM

Bellamkonda Sreenivas Movie Creates World Record In Youtube - Sakshi

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ నటించిన సూపర్‌ హిట్ చిత్రం 'జయ జానకి నాయక'. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజై ఇప్పటికీ ఐదేళ్లు దాటిపోయినా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్‌లో రిలీజ్ అయినప్పటీ నుంచి ఓ రేంజ్‌లో దూసుకెళ్తోంది. తాజాగా 800 మిలియన్ల వ్యూస్‌తో ప్రపంచ రికార్డ్ సృష్టించింది. కాగా.. ఈ సినిమాను హిందీలో ఖుంఖార్‌ పేరుతో రిలీజ్‌ చేశారు. సౌత్‌ డబ్బింగ్‌ మూవీస్‌లో ఇప్పటివరకు జయ జానకి నాయక మాత్రమే ఈ రికార్డ్‌ సాధించింది. యశ్ నటించిన కేజీఎఫ్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది.

కానీ తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయిన ఈ సినిమా హిందీలో మాత్రం రికార్డులు బద్దలు కొడుతోంది. గతంలోనే హిందీ వర్షన్‌ కేజీఎఫ్‌ సినిమాను అధిగమించేసింది. ఇప్పటి వరకు కేజీఎఫ్‌ 772 మిలియన్ల వ్యూస్‌తో రెండోస్థానంలో కొనసాగుతోంది. కాగా.. అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఆ తర్వాత స్పీడున్నోడు సినిమాలో నటించాడు. ఆ తర్వాత మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ ఆగస్ట్‌ 11వతేదీ 2017లో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement