థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా | Bellamkonda Sai Sreenivas BSS11 Announced | Sakshi
Sakshi News home page

థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా

Jul 1 2024 3:16 PM | Updated on Jul 1 2024 3:35 PM

Bellamkonda Sai Sreenivas BSS11 Announced

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చారు. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై మెరిసేందుకు అడుగులు వేస్తున్నారు. చివరిగా బాలీవుడ్‌లో ఛత్రపతి సినిమాలో నటించిన ఆయన కొన్ని రోజుల క్రితం టైసన్‌ నాయుడు చిత్రాన్ని ప్రారంభించారు. అయితే, తాజాగా #BSS11 పేరుతో మరో కొత్త ప్రాజెక్ట్‌ను ఆయన పట్టాలెక్కించారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మరోసారి ఈ సినిమాలో జోడిగా కనిపించనున్నారు. గతంలో వారిద్దరూ 'రాక్షసుడు' సినిమాలో  నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని  కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించనున్నారు. 'చావు కబురు చల్లగా' అనే సినిమాను ఆయన డైరెక్ట్‌ చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఈ సినిమాను శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం 8 పేరుతో సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో #BSS11 ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమం జరిగింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ అందరినీ మెప్పించేలా ఉంది. హారర్-మిస్టరీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement