ఆస్కార్‌ అవార్డు లక్ష్యంగా రాకా: దర్శకుడు అట్లీ | Atlee Confident of Taking Allu Arjun Raaka to the Oscars | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌ అవార్డు లక్ష్యంగా రాకా: దర్శకుడు అట్లీ

Oct 7 2026 3:44 AM | Updated on Oct 7 2026 3:44 AM

Atlee Confident of Taking Allu Arjun Raaka to the Oscars

ఆస్కార్‌ అవార్డు అందుకోవడమే తన కల అని దర్శకుడు అట్లీ అన్నారు. ‘రాకా’ సినిమా యూనిట్‌ అంతా ఆస్కార్‌ అవార్డును టార్గెట్‌గా పెట్టుకుని పని చేస్తున్నామని కూడా అట్లీ తెలి పారు. అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘రాకా’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంటోంది. కాగా, చెన్నైలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో అట్లీ తన ఆస్కార్‌ అవార్డు కల గురించి మాట్లాడారు. ‘‘అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమాకు గుర్తింపు రావాలని కోరుకోవడం అత్యాశ ఏం కాదని అనుకుంటున్నాను. 

ఇక ఆస్కార్‌ అవార్డు అందుకోవాలన్నది నా చిన్నప్పటి కల. ఇందుకోసం నేను శక్తి వంచన లేకుండా పని చేస్తున్నాను. ఆస్కార్‌ కల అసాధ్యమేమీ కాదు. మనం సాధించగలమనే నమ్మకం ఉండాలి. ఆస్కార్‌ అవార్డును సాధించగలమని మా ‘రాకా’ టీమ్‌ గట్టి నమ్మకంతో ఉంది. ఆస్కార్‌ వేదికపై తమిళ భాషలో మాట్లాడాలని నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. 

తమిళ ప్రజలు గర్వపడేలా ఆస్కార్‌ వేదికపై మాట్లాడతాను. ప్రేక్షకులు గర్వపడేలా ‘రాకా’ సినిమా ఉంటుంది’’ అని అట్లీ పేర్కొన్నారు. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ ‘రాకా’ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలి భాగం 2027లో, మలి భాగం 2028లో వస్తుందని.. ఒకే భాగం అయితే ‘రాకా’ 2028లోనే విడుదలవుతుందనే ప్రచారం సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement