
నా సామిరంగ బ్యూటీ ఆషికా రంగనాథ్ నటించిన కన్నడ సినిమా గతవైభవ. ఈ చిత్రంలో శాండల్‌వుడ్ హీరో దుశ్యంత్ నటించారు. ఫాంటసీ మూవీగా తెరకెక్కించిన ఈ చిత్రానికి సింపల్ సుని దర్శకత్వం వహించారు. ఈ సినిమాను నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగులోనూ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ మూవీని ఎపిక్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కించారు. టీజర్ చూస్తుంటే మైథాలజీ టచ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో సీన్స్ చూస్తే పురాణాల నేపథ్యంలో రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ సినిమాను సర్వ్‌గర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్లపై దీపక్ తిమ్మప్ప, సుని సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జుడా సంధి సంగీతమందించగా.. విలియం జె డేవిడ్ సినిమాటోగ్రఫీ అందించారు.