అర్జున్‌ చిన్నకూతురి ఎంగేజ్‌మెంట్‌.. 13 ఏళ్ల ప్రేమ అంటూ.. | Arjun sarja Daughter Anjana Engaged with Boy Friend in Italy | Sakshi
Sakshi News home page

పెళ్లిపీటలెక్కనున్న అర్జున్‌ సర్జా చిన్న కూతురు.. ఎంగేజ్‌మెంట్‌ పిక్స్‌ వైరల్‌

Apr 17 2025 4:55 PM | Updated on Apr 17 2025 5:14 PM

Arjun sarja Daughter Anjana Engaged with Boy Friend in Italy

కన్నడ యాక్షన్‌ హీరో అర్జున్‌ సర్జా (Arjun Sarja) చిన్న కూతురు అంజనా త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. తాజాగా ప్రియుడితో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని అంజనా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. 13 ఏళ్ల తర్వాత నెరవేరింది.. అవును, మీరనుకునేదే అంటూ ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు హింట్‌ ఇచ్చింది. ఈ మేరకు కొన్ని ఫోటోలు షేర్‌ చేసింది. 

ఫ్యామిలీ సమక్షంలో..
అందులో ప్రియుడు మోకాలిపై కూర్చుని అంజనాకు ప్రపోజ్‌ చేస్తున్నట్లుగా ఉంది. మరో ఫోటోలో అతడు అంజనాను ఎత్తుకుంటే వెనకాల అర్జున్‌ సర్జా దంపతులు.. ఐశ్వర్య దంపతులు చిరునవ్వులు చిందిస్తున్నారు. మరో పిక్‌లో అందరూ కలిసి గ్రూప్‌ ఫోటో దిగారు. ఇరు కుటుంబాల సమక్షంలో ఈ ప్రేమపక్షుల ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు తెలుస్తోంది.  ఇది చూసిన అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇద్దరు కూతుర్లతో అర్జున్‌ సర్జా

సినిమా
అర్జున్‌ సర్జా అసలు పేరు శ్రీనివాస్‌ సర్జా. ఈయన కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో అనేక సినిమాల్లో నటించాడు. తెలుగులో త్రిమూర్తులు, హనుమాన్‌ జంక్షన్‌, శ్రీ ఆంజనేయం, పుట్టింటికి రా.. చెల్లి, రామరామ కృష్ణ కృష్ణ, నా పేరు సూర్య వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. దర్శకుడిగా 10కి పైగా సినిమాలు తెరకెక్కించాడు.

ఇద్దరు కూతుర్లు
అర్జున్‌ 1988లో నటి నివేదితను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతుర్లు ఐశ్వర్య, అంజన సంతానం. ఐశ్వర్య హీరోయిన్‌గా పలు సినిమాలు చేసింది. ఈమె గతేడాది నటుడు ఉమాపతి రామయ్యను పెళ్లి చేసుకుంది. చిన్న కూతురు అంజన విషయానికి వస్తే.. ఈమె సర్జా వరల్డ్‌ కంపెనీని స్థాపించడంతో పాటు దానికి సీఈవోగా వ్యవహరిస్తోంది.

 

 

చదవండి: రాజ్‌తరుణ్‌ పేరెంట్స్‌ను ఇంట్లోకి రానిచ్చిన లావణ్య.. 'అరియానా ఆడియో లీక్‌ వైరల్‌'

Advertisement
 
Advertisement
Advertisement