కాస్ట్ లీ కారు కొన్న ఏఆర్ రెహమాన్.. ధర ఎంతో తెలుసా? | AR Rahman Buys New EV Car | Sakshi
Sakshi News home page

AR Rahman: రెహమాన్ కొత్త కారు.. స్పెషల్ ఏంటంటే?

Apr 18 2025 6:30 PM | Updated on Apr 18 2025 6:42 PM

AR Rahman Buys New EV Car

కార్లలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ ట‍్రెండ్ నడుస్తోంది. ఓవైపు పెట్రోల్ వాహనాలు ఉపయోగిస్తున్నప్పటికీ.. చాలామంది ఎలక్ట్రిక్ మోడల్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా ఇప్పుడు ఆ లిస్టులోకి చేరిపోయాడు. ఖరీదైన ఓ కారుని ఇప్పుడు తన గ్యారేజీలోకి తీసుకొచ్చేశాడు. 

రెహమాన్.. తెలుగు, తమిళ, హిందీతో సహా పలు భాషల్లో గత కొన్ని దశాబ్దాలుగా పాటలు స్వరపరుస్తున్నారు. తెలుగులోనూ రామ్ చరణ్ 'పెద్ది' పనిచేస్తున్నారు. సరే ఈ సంగతులంతా పక్కనబెడితే తాజాగా మహీంద్ర కంపెనీకి చెందిన XEV 9e మోడల్ కారుని కొనుగోలు చేశారు. ఈ మేరకు తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)  

మహీంద్ర సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ కారు ఇది. ధర రూ.25-35 లక్షల మధ్య ఉండొచ్చు. రెహమాన్ ఈ కారు కొనడం వెనక మార్కెటింగ్ కూడా ఉంది. ఎందుకంటే ఈ మోడల్ తోపాటు బీఎస్6 మోడల్ కారులో సౌండింగ్ కోసం రెహమాన్ పనిచేశారు. ఇప్పుడు తాను కొన్న కారులోనూ డాల్బీ ఆట్మస్ సౌండింగ్ ని ఏర్పాటు చేశారు. స్వయంగా ఇతడే ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.

రెహమాన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. దాదాపు 29 ఏళ్లపాటు కాపురం చేసిన తర్వాత భార్య సైరాభానుకి కొన్నాళ్ల క్రితం విడాకులు ఇచ్చేశారు. కారణం ఏంటనేది మాత్రం బయటపెట్టలేదు.

(ఇదీ చదవండి: జర్మనీ అమ్మాయితో సూపర్ స్టార్ కొడుకు డేటింగ్)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement