
కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఆరాటపడ్డాడు అనుపమ్ ఖేర్ (Anupam Kher). విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని తాపత్రయపడ్డాడు. మంచి కథలను ఎంపిక చేసుకుని నటించేవాడు. గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే వృత్తి కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశాడు. అనుపమ్ ఖేర్.. 1979లో నటి మధుమాలతిని పెళ్లి చేసుకోగా కొంతకాలానికే విడిపోయారు. 1985లో నటి కిరణ్ ఖేర్ (Kirron Kher)ను పెళ్లాడాడు. కిరణ్‌కు కూడా ఇది రెండో పెళ్లి!
కొడుకున్న నటితో రెండో పెళ్లి
గతంలో ఆమె వ్యాపారవేత్త గౌతమ్‌ను పెళ్లాడగా వీరికి సికిందర్ అనే కుమారుడు జన్మించాడు. దంపతుల మధ్య పొరపచ్చాలు రావడంతో అతడికి విడాకులిచ్చేసి 1985లో అనుపమ్‌ను పెళ్లాడింది. అయితే అనుపమ్- కిరణ్ జంటకు సంతానం లేదు. గతంలో ఈ విషయాన్ని తలుచుకుని బాధపడ్డాడు నటుడు. ఎంతైనా ఓ కొడుకు ఉంటే, వాడు కళ్ల ముందు పెరుగుతూ ఉంటే ఆ సంతోషమే వేరేలా ఉండేదని ఫీలయ్యాడు.
గర్భం దాల్చినా..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి గుండెలోని వెలితిని వెల్లడించాడు. నేను స్థాపించిన స్వచ్ఛంద సంస్థలో ఎంతోమంది పిల్లలతో కలిసి పని చేస్తుంటాను. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. సే నా సమ్‌థింగ్ టు అనుపమ్ అంకుల్ అని వారితో ఓ షో చేసేవాడిని. ఇది చిన్నారుల షో! కన్నకొడుకు లేనందుకు ఒక్కోసారి బాధగా అనిపిస్తుంది. మా పెళ్లయిన మొదట్లో కిరణ్ ప్రెగ్నెంట్ అవలేదు. తీరా గర్భం దాల్చినప్పుడు లోపల శిశువు ఎదుగుదల సరిగా లేదు.
అప్పుడేదీ మిస్ అవలేదు
నేను కెరీర్‌లో బిజీగా ఉండటంతో పట్టించుకోలేదు. అయినా నాకు సికిందర్ చాలు. కిరణ్‌ను పెళ్లి చేసుకున్నప్పుడు అతడికి నాలుగేళ్లు. తను నా జీవితంలోకి వచ్చాక నేనేదీ మిస్ అవుతున్నట్లు అనుకోలేదు. 60 దాటాక మాత్రమే నాకంటూ కన్న కొడుకుంటే బాగుండని కొన్నిసార్లు అనిపించింది అని చెప్పుకొచ్చాడు. అనుపమ్ కీలక పాత్రలో నటించిన తన్వి ద గ్రేట్ మూవీ జూలై 18న విడుదల కానుంది. అలాగే హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న రిలీజ్ అవుతోంది.
చదవండి: బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ కాదు.. రాజమౌళి బెస్ట్ ఫిల్మ్ ఇదేనట!