ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చిన యాంకర్‌ శ్రీముఖి | Anchor Sree mukhi Gifts Ford Car To His Brother | Sakshi
Sakshi News home page

Sreemukhi: తమ్ముడికి కాస్ట్‌లీ కారు గిఫ్టుగా ఇచ్చిన శ్రీముఖి

Oct 9 2021 6:27 PM | Updated on Oct 9 2021 7:37 PM

Anchor Sree mukhi Gifts Ford Car To His Brother - Sakshi

Anchor Sree mukhi Gifts Ford Car To His Brother: యాంకర్‌ శ్రీముఖి.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన ముద్దు ముద్దు మాటలతో పాటు ఆకర్షించే అందం, అల్లరితో ప్రేక్షకులను ఎంతగానే అలరిస్తూ వస్తుంది. ప్రోగ్రామ్‌ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు. తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది. బుల్లితెరపై ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అభిమానులతో షేర్‌ చేస్తుంటుంది.

తాజాగా తన తమ్ముడు సుష్రుత్‌ కోసం ఖరీదైన ఫోర్డ్‌ కారును కొని గిఫ్టుగా ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్‌ ఛానెల్‌లో షేర్‌ చేసింది. దీంతో ఇద్దరికీ కంగ్రాట్స్‌ చెబుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఫోర్డ్‌ భారత్‌లో  కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇలాంటి కారు ఎందుకు కొన్నావంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement