మళ్లీ వచ్చేస్తున్న 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి'.. అమితాబ్‌ పారితోషికం ఎంతంటే? | Amitabh Bachchan Remuneration for Kaun Banega Crorepati 17 | Sakshi
Sakshi News home page

Amitabh Bachchan: 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి 17'.. ఒక్కో ఎపిసోడ్‌కు కోట్లల్లో రెమ్యునరేషన్‌!

Jul 17 2025 2:05 PM | Updated on Jul 17 2025 2:05 PM

Amitabh Bachchan Remuneration for Kaun Banega Crorepati 17

ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. కౌన్‌ బనేగా కరోడ్‌పతి 17వ సీజన్‌తో అలరించనున్నాడు. ఈ షో ఆగస్టు 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని సోనీ టీవీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్‌ చేసింది. అందులో ఈసారి కూడా అమితాబ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నట్లు చూపించారు.

25 ఏళ్ల క్రితం మొదలు..
ఈ క్రమంలో బిగ్‌బీ పారితోషికం ఎంత ఉండొచ్చు? అని నెటిన్లు చర్చించుకుంటున్నారు. బీటౌన్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అమితాబ్‌.. ఒక్క ఎపిసోడ్‌కు రూ.5 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడట! 25 ఏళ్ల క్రితం కౌన్‌ బనేగా కరోడ్‌పతి షో (Kaun Banega Crorepati Show) మొదలైంది. బిగ్‌బీ అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పినవారు రూ.1 కోటి గెల్చుకునే అవకాశం ఉంటుంది. దీనికి సెలబ్రిటీలను కాకుండా సామాన్యులనే పార్టిసిపెంట్లుగా ఎంపిక చేసుకుంటారు. అందుకే ఈ షోకు ఎక్కువ క్రేజ్‌!

తెలుగులోనూ..
బిగ్‌బీ హోస్టింగ్‌, కోటి రూపాయల ప్రైజ్‌మనీతో.. రియాలిటీ షోలలోనే కేబీసీ సరికొత్త సంచలనంగా నిలిచింది. ఇదే షో తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరిట ప్రారంభమైంది. మొదటి మూడు సీజన్లు నాగార్జున, నాలుగో సీజన్‌ చిరంజీవి, ఐదో సీజన్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేశారు. తర్వాతేమైందో కానీ తెలుగులో ఈ షోను కొనసాగించలేదు. అమితాబ్‌ సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం సెక్షన్‌ 84 మూవీ చేస్తున్నాడు. దీనితో పాటు బిగ్‌బీ చేతిలో.. బ్రహ్మాస్త్ర 2, కల్కి 2898 ఏడీ సీక్వెల్‌ సినిమాలున్నాయి.

 

 

చదవండి: నా భార్య గర్భం దాల్చినా.. అందుకే పిల్లలు లేరు: అనుపమ్‌ ఖేర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement