వివాహాబంధంలోకి అడుగుపెట్టిన ఎంఎస్ ధోని నటి! | Amitabh Bachchan Co-Star Swini Khara Gets Married To Urvish Desai, Wedding Pics Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Swini Khara-Urvish Desai Marriage Photos: పెళ్లి చేసుకున్న అమితాబ్ కోస్టార్.. జైపూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్!

Dec 28 2023 7:55 AM | Updated on Dec 28 2023 9:41 AM

Amitabh Bachchan co star Swini Khara gets married to Urvish Desai - Sakshi

ప్రముఖ బాలీవుడ్ నటి వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఈ వేడుకలో స్విని ఖరా తన ప్రియుడిని పెళ్లాడింది. అమితాబ్ బచ్చన్ నటించిన చిత్రంలో బాలనటిగా మెప్పించిన స్వీని ఖరా కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. జైపూర్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో ఉర్విష్ దేశాయ్‌తో ఏడడుగులు నడిచారు. ఈ విషయాన్ని నటి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పెళ్లికి సంబధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు పలువురు సినీతారలు కూడా హాజరయ్యారు.  

కాగా.. స్విని 2005లో విద్యాబాలన్ నటించిన పరిణీతతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. అదే ఏడాది టీవీ సీరియల్ బా బహూ ఔర్ బేబీలో కూడా నటించింది. అమితాబ్ బచ్చన్. టబు, పరేష్ రావల్ నటించిన చిత్రం చీనీ కమ్. ఈ చిత్రం‌లో స్వినీ ఖరా బాలనటుడిగా 'సెక్సీ' అనే పాత్రను పోషించింది.  ఆ తర్వాత ఆమె జాన్ అబ్రహం చిత్రం ఎలాన్, హరి పుత్తర్, షాహిద్ కపూర్ నటించిన పాఠశాల, ఢిల్లీ సఫారి, ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రాల్లో కనిపించింది. అంతే కాకుండా ధరి కా వీర్ యోధా పృథ్వీరాజ్ చౌహాన్, దిల్ మిల్ గయే, సీఐడీ, జిందగీ ఖట్టి మీథీ వంటి షోలు చేసింది. ఆమె వృత్తిరీత్యా న్యాయవాది కాగా.. చదువుపై దృష్టి పెట్టేందుకు నటనకు స్వస్తి చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement