
అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా సూపర్‌స్టార్. పుష్ప, పుష్ప 2 సినిమాలతో రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో కెరీర్ విషయంలో బన్నీ ఆచితూచి అడుగులేస్తున్నాడు. త్రివిక్రమ్‌తో కమిటైన ప్రాజెక్ట్ పక్కనబెట్టి దర్శకుడు అట్లీకి ఓకే చెప్పింది కూడా బహుశా అందుకేనేమో? బన్నీ పరిస్థితి చూసి చాలా ఏళ్ల క్రితం అనుకున్న ఓ ప్రాజెక్ట్‌ని పక్కనబెట్టేశారు. ఈ విషయమై నిర్మాత దిల్ రాజు స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
'పుష్ప'కి ముందు అల్లు అర్జున్ క్రేజ్.. తెలుగుతో పాటు మలయాళం వరకు మాత్రమే పరిమితం. అలా అప్పట్లో 'ఐకాన్' అనే ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. దీనికి 'వకీల్ సాబ్' ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. అఫీషియల్‌గా పోస్టర్ లాంచ్ కూడా చేశారు. కానీ పుష్ప చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌డమ్ వచ్చేసరికి.. 'ఐకాన్' విషయంలో దర్శకనిర్మాతలు వెనకడుగు వేశారు. తాజాగా 'తమ్ముడు' ప్రమోషన్లలో భాగంగా దిల్ రాజు దీని గురించి చెప్పారు.
(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'.. నేను చేసిన పెద్ద తప్పు: దిల్ రాజు)
ప్రకటించే సమయానికి ఇప్పటికీ బన్నీ రేంజ్ మారిపోయిందని, కాబట్టి త్వరలో మరో హీరోతో 'ఐకాన్' తీస్తామని దిల్ రాజు చెప్పుకొచ్చారు. అలానే 'తమ్ముడు' రిలీజ్ టెన్షన్స్ అన్నీ అయిపోయాక.. 'ఐకాన్' స్క్రిప్ట్‌ని శ్రీరామ్ వేణు బయటకు తీస్తాడేమో అని ఈయన అన్నారు. హ్యూమన్ యాక్షన్ స్టోరీ అదని, ఎప్పుడు చేసినా బాగుంటుందని దిల్ రాజు అన్నారు. మరి ఆ స్టోరీ ఎవరికి సూట్ అవుతుందో? ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి?
అయితే వచ్చే ఏడాది బన్నీ.. తన నిర్మాణంలో ఓ సినిమా చేస్తారని దిల్ రాజు ప్రకటించారు. ఇది భారీ స్థాయిలో ఉంటుందని హింట్ ఇచ్చారు. కానీ దర్శకుడు ఎవరు ఏంటనేది మాత్రం రివీల్ చేయలేదు. కొన్నిరోజుల క్రితం బహుశా దీని గురించి అనుకుంటా కొన్నిరూమర్స్ వచ్చాయి. ప్రశాంత్ నీల్‌తో బన్నీ జట్టు కడతారని, దీనికి దిల్ రాజు నిర్మాత అన్నట్లు రూమర్స్ వచ్చాయి. మరికొన్నాళ్లు ఆగితే ఇది నిజమా కాదా అనేది తేలుతుంది.
(ఇదీ చదవండి: చిరు పక్కన అనామక హీరోయిన్?)
