Allu Arjun: గ్రాండ్‌గా వరుణ్‌ తేజ్‌ 'గని' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌..

Allu Arjun Chief Guest For Varun Tej Ghani Movie Pre Release Event - Sakshi

Allu Arjun Chief Guest For Varun Tej Ghani Movie Pre Release Event: మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గని'. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించారు.  ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో సిద్దు , అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు, ట్రైలర్‌కు అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించనుంది. 

అయితే ఈ కార్యక్రమం గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు మేకర్స్‌. ఘనంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ విచ్చేయనున్నారట. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా మేకర్స్‌ వెల్లడించారు. అల్లు అర్జున్‌ రాకతో ఈ కార్యక్రమం మరింత సందడిగా మారనుంది. కాగా వరుణ్‌ తేజ్‌ బాక్సర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బీటౌన్‌ బ్యూటీ సాయి మంజ్రేకర్‌ హీరోయిన్‌గా చేస్తోంది. వరుణ్‌కు తల్లిగా నదియా కనిపించనున్నారు. జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్‌ శెట్టి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనువిందు చేయనున్నారు. అంతేకాకుండా తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా 'కోడితే' అంటూ ప్రత్యేక గీతంలో అలరించనుంది. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top