అలియా భట్‌ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న ప్రముఖ నిర్మాత | Rana Daggubati To Present Alia Bhatt Jigra Movie Telugu Version, Check Release Date And Theatrical Trailer | Sakshi
Sakshi News home page

Jigra Telugu Version Release: అలియా భట్‌ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న ప్రముఖ నిర్మాత

Sep 29 2024 7:22 AM | Updated on Sep 29 2024 10:10 AM

Alia Bhatt Jigra Telugu Version Also Will Release

బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ అలియా భట్‌ నటించిన జిగ్రా సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది. ఈమేరకు తాజాగా ప్రకటన వెలువడింది. ఇప్పటికే విడుదలైన  ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.  ఈ చిత్రంలో వేదాంగ్‌ రైనా కీలక పాత్ర పోషిస్తున్నాడు.  వాసన్‌ బాలా దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, ఎటర్నల్ సన్‍షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, షహీన్ భట్, సౌమెన్ మిశ్రాతో పాటు ఆలియా భట్ కూడా పెట్టుబడులు పెట్టారు.

జిగ్రా ట్రైలర్‌కు మంచి ఆధరణ రావడంతో తెలుగు నిర్మాతలు కూడా ఈ సినిమాపై మక్కువ చూపారని తెలుస్తోంది. ఈ క్రమంలో జిగ్రా తెలుగు వర్షన్‌ థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‍మెంట్ సంస్థ సొంతం చేసుకుంది. అక్టోబర్‌ 11న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని వారు విడుదల చేయనున్నారు. టాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉన్న దగ్గుబాటి సురేశ్‍, సునీల్ నారంగ్‌లకు చెందిన సంస్థ నుంచి ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తుండడంతో మూవీపై ఆసక్తి పెరిగింది.  నేడు సెప్టెంబర్‌ 29న తెలుగు ‍ట్రైలర్‌ విడుదల కానుంది.

జిగ్రా సినిమాలో భారీ యాక్షన్‌తో కూడిన స్టంట్స్‌ కూడా ఆలియా భట్ చేశారు. తన తమ్ముడిని రక్షించుకునేందుకు ఆమే చేసిన సాహసం ఎలాంటిదో ఈ చిత్రంలో దర్శకుడు చూపించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌పై చాలామంది బాలీవుడ్‌ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement