బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్'.. హాట్‌స్టార్ అలా క్లూ ఇచ్చేసిందా..? | Alekhya Chitti Pickles Sisters Enter Bigg Boss Telugu 9 | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌.. హాట్‌స్టార్ అలా క్లూ ఇచ్చేసిందా..?

Apr 5 2025 1:40 PM | Updated on Apr 5 2025 3:07 PM

Alekhya Chitti Pickles Sisters Enter Bigg Boss Telugu 9

ప్రముఖ రియల్టీ షో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌- 9 కొన్ని నెలల్లో ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది ఆగష్టు లేదా సెప్టెంబర్‌ మొదటి వారంలో ఈ షో మొదలౌతుందని తెలిసిందే. అంటే మరో నాలుగు నెలల్లో బిగ్‌బాస్‌ రన్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. ఇప్పటికే అందుకు సంబంధించిన పనుల్లో యూనిట్‌ ఉంది.  సీజన్‌-9లో పాల్గొనే కంటెస్టంట్స్‌ ఎంపిక విషయంలో బిగ్‌బాస్‌ టీమ్‌ ఉంది.

సోషల్‌మీడియాలో బాగా వైరల్‌ అయిన వారికే బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఛాన్స్‌  దక్కుతుంది. అలాంటి వారినే టీమ్‌ సెలక్ట్‌ చేస్తుంది. అయితే, కొద్దిరోజులుగా 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నారు. సోషల్‌మీడియాలో మిలియన్ల కొద్ది వారికి ఫాలోవర్స్‌ ఉన్నారు. చాలాకాలంగా పచ్చళ్ళ వ్యాపారం చేస్తూ ట్రెండింగ్‌లో ఉన్నారు. అయితే, కస్టమర్స్‌పై వారు బూతులతో విరుచుకుపడటం.. అందుకు సంబంధించిన ఆడియోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. దీంతో అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్‌పై మీమ్స్‌, ట్రోల్స్‌, వీడియోలు కనీసం 100 మిలియన్స్‌కు పైగానే వ్యూస్‌తో ట్రెండ్‌ అవుతున్నాయి. 

అలా అలేఖ్య చిట్టి పికిల్స్‌ సిస్టర్స్‌లలో (చిట్టి, అలేఖ్య, రమ్య) ఒకరికి తప్పుకుండా బిగ్‌బాస్‌లోకి ఛాన్స్‌ వస్తుందని నెట్టింట వైరల్‌ అవుతుంది. కానీ, రమ్యకు ఛాన్స్‌ దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయిని తెలుస్తోంది. మోడ్రన్‌ డ్రెస్‌లతో ఆమె రీల్స్‌ ఎక్కువగా ట్రెండ్‌ అవుతుంటాయి కూడా.. రీసెంట్‌గా జియోహాట్‌స్టార్‌లో పికిల్స్‌కు సంబంధించిన ఒక సీన్‌ను వారు షేర్‌ చేశారు. ప్రభాస్‌ ఛత్రపతి సినిమా నుంచి ఒక వీడియోను విడుదల చేశారు.

ఇదే విషయంపై బిగ్‌బాస్‌ ఆదిరెడ్డి కూడా తన యూట్యూబ్‌ ఛానల్‌లో అభిప్రాయం చెప్పాడు. వారిలో ఒకరు బిగ్‌బాస్‌కు రావచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. అసలు బిగ్‌బాస్‌కు కూడా కావాల్సింది ఇలాంటి కాంట్రవర్సీ వ్యక్తులే అని చెప్పవచ్చు. అప్పుడే తమ రేటింగ్స్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు అనుకుంటారు.  ఇంత గొడవ జరుగుతున్నా సరే అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్‌ ధైర్యంగా కెమెరాల ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పి వివరణ ఇచ్చారు. ఆపై లెక్కలేనన్ని నెగటివ్‌ కామెంట్లు వస్తున్నా సరే వాటిని తట్టుకుని నిలబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి వారి పేర్లు నోటెడ్‌ అయిపోయాయి. ఇలా ఎన్నో అంశాలు వారికి బిగ్‌బాస్‌ ఛాన్స్‌ దక్కేలా చేస్తాయని చెప్పవచ్చు.  

Advertisement
 
Advertisement
Advertisement