
అక్కినేని హీరో అఖిల్.. హీరోగా ఐదు సినిమాలు చేశాడు. కానీ వీటిలో ఒక్కటి యావరేజ్, మిగతావన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. గతంలో ఓసారి నిశ్చితార్థం జరగ్గా.. అది రద్దయింది. దీంతో చాన్నాళ్ల పాటు అఖిల్ వ్యక్తిగత జీవితం గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ ఉన్నఫలంగా గతేడాది నవంబరులో తనకు నిశ్చితార్థం జరిగిందని చెప్పి అందరికీ షాకిచ్చాడు.
జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్‌మెంట్ గతేడాది నవంబరులో జరిగింది. దీని తర్వాత పలుమార్లు ఎయిర్‌పోర్ట్‌లో జంటగా కనిపించారు. కానీ ఇప్పుడు పెళ్లి విషయంలో సడన్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 6నే ఈ శుభకార్యం జరగనుందని సోషల్ మీడియాలో చిన్నగా టాక్ వినిపిస్తోంది. మరి ఇది నిజమా కాదా అనేది అఖిల్ చెప్పాలి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మోహన్ లాల్ రీసెంట్ హిట్ మూవీ)
ఇకపోతే గతేడాది నవంబరులో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. తర్వాత కొన్నిరోజులకే అక్కినేని ఇంట్లో మరో శుభకార్యం జరిగింది. అదే నాగచైతన్య పెళ్లి. గతంలో సమంతతో ఏడడుగులు వేసిన చైతూ.. నాలుగేళ్లకే ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. తర్వాత కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న ఇతడు.. హీరోయిన్ శోభితతో ప్రేమలో పడ్డాడు. గతేడాది డిసెంబరులో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
ఇప్పుడు అఖిల్ కూడా జూన్ తొలివారంలో పెళ్లి చేసుకోబోతున్నాడనే న్యూస్ బయటకొచ్చింది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఈపాటికే ఏర్పాట్లు జరుగుతూ ఉండాలి. లేదంటే శుభలేఖల్లాంటివి ఏమైనా ఫొటోలు లీక్ కావాలి. కానీ అలాంటి సూచనలేం కనిపించట్లేదు. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న పుకార్లు నిజమేనా? కాదా అనే దానిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది.
(ఇదీ చదవండి: విజయ్ ఆంటోనీ... మరో డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ)