After Ranbir Kapoor, Ananya Birla, Shreyas Media Donates Adipurush Tickets To Temples - Sakshi
Sakshi News home page

Adipurush: 'ఆదిపురుష్‌' కోసం ఎవరెన్ని టికెట్లు కొన్నారంటే..!

Jun 15 2023 6:13 PM | Updated on Jun 15 2023 6:26 PM

Adipurush Tickets Ranbir Kapoor Ananya Birla Shreyas Media Donate - Sakshi

ప్రభాస్‌ రాముడిగా దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన భారీ బడ్జెట్‌ చిత్రం'ఆదిపురుష్‌'. రేపు (జూన్‌ 16)న విడుదుల కానుంది. రామాయణ పారాయణం జరిగే చోటుకు హనుమంతుడు విచ్చేస్తాడనే నమ్మకంతో 'ఆదిపురుష్‌' టీమ్‌ ప్రతి థియేటర్‌లో ఒక సీటును హనుమంతుడి కోసం కేటాయించింది. ఈ నేపథ్యంలో మరికొందరు వేల సంఖ్యలో టికెట్లను కొని.. విద్యార్థులకు, పేదలకు అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరెవరు ఎన్ని టికెట్లు కొన్నారంటే..

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్‌' అక్కడ కేవలం 24 టికెట్లే అమ్ముడుపోయాయట)

ప్రముఖ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ ముందుగా 10 వేల టికెట్లను కొనుగోలు చేశారు.  తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు చెందిన వారికి ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ , ప్రముఖ సింగర్‌ అనన్య బిర్లా  ఒక్కొక్కరు 10 వేల టికెట్లు బుక్‌ చేశారు. వాటిని పేద చిన్నారులకు ఇవ్వనున్నారు.

(ఇదీ చదవండి: తన భర్త నుంచి కాపాడాలంటూ సీఎం స్టాలిన్‌ని కోరిన నటి)

ఈవెంట్‌ ఆర్గనైజింగ్‌ సంస్థ శ్రేయస్‌ మీడియా అధినేత శ్రీనివాస్‌ ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉన్న రామాలయానికి 101 టికెట్లు ఇవ్వనున్నుట్టు ప్రకటించారు. అంటే, ఆ టికెట్ల సంఖ్య దాదాపు 1,40,000 కానుంది. మంచు మనోజ్ దంపతులు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనాథ శరణాలయాల్లోని చిన్నారుల కోసం 2500 టికెట్లను కొనుగోలు చేశారు. ఇండియన్‌ సినిమా చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement