నన్ను, నా బిడ్డను చంపేస్తాడు.. కాపాడండి సీఎం గారు: నటి

Divya Sridhar Requests Tamil Nadu Chief Minister MK Stalin Take Action Against Arnav - Sakshi

కోలీవుడ్‌లో ప్రముఖ బుల్లితెర నటి దివ్య.. తన భర్త అర్ణవ్ నుంచి కాపాడాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను అభ్యర్థించింది. అక్కడ ప్రసారం అయ్యే 'సెవ్వంతి' సీరియల్‌తో నటి దివ్య  ఫేమస్ అయింది. గతేడాది బుల్లితెర నటుడు అయిన అర్ణవ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గర్భందాల్చిన సమయంలో తన కడుపుపై అర్ణవ్‌ తన్నాడని, మానసికంగా హింసించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం అర్ణవ్‌ బెయిల్‌పై విడుదల అయ్యాడు. 

మరో ఇద్దరు మహిళలను ఆర్నవ్ మోసం చేశాడు?
 అర్ణవ్ ఇద్దరు మహిళలను మోసం చేశాడంటూ దివ్య  ఆడియో విడుదల చేసింది. వారిద్దరిని కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తెలిపింది. బెయిల్‌పై విడుదల అయిన అర్ణవ్ తన మనుషులు, లాయర్లతో వచ్చి  గొడవ పడ్డాడని దివ్య సంచలన ఆరోపణ చేసింది. అర్దరాత్రి ఒక్కసారిగా 15 మందితో తన ఇంటి తలుపు తట్టాడని తెలిపింది. వారందరూ తనను తోసుకుంటూ ఇంట్లోకి చొరబడ్డారని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: సినిమా రంగంలోనే డ్రగ్స్‌ ఎందుకు?)

అతను బెయిల్‌పై ఉన్నాడు 

ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఆమె ఇలా ఫిర్యాదు చేసింది. 'ప్రస్తుతం అర్ణవ్‌ షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నాడు. ఈ సమయంలో అతను నా ఇంటికి రాకూడదు. నన్ను బెదిరించి, నా పాపను చంపడానికి ప్రయత్నించాడు. నేను ఎక్కడికి వెళ్తున్నానో అతనికి అన్నీ తెలుసు.. అందుకోసం ఒక వ్యక్తిని గూఢచారిగా పెట్టుకున్నాడు. ఎప్పటికైనా నన్ను చంపేస్తాడు. నా ఇంట్లో ఇద్దరు వృద్ధులు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అతను మా ఇంటికి వచ్చి బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుంది. ఆయనపై చర్యలు తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను’ అని దివ్య కన్నీరు పెట్టుకుంది. 

(ఇదీ చదవండి: Drugs Case: కేపీ చౌదరి ఫోన్‌ లిస్ట్‌లో సినీ ప్రముఖల లిస్ట్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top