ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్.. ఈమె ఎవరో తెలుసా?

Actress Priya Bhavani Shankar Movies And Family Details - Sakshi

కెరీర్ ప్రారంభంలో పక్కింటి అమ్మాయి ఇమేజ్ పొందిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత రూట్ మార్చింది. మోడ్రన్‌గా మారిపోయింది. మెల్లమెల్లగా ఎదుగుతూ టాప్ హీరోయిన్ రేంజుకి చేరుకుంది. ఇప్పటివరకు చెప్పింది హీరోయిన్ ప్రియా భవాని శంకర్‌ గురించే. మొదట్లో న్యూస్ రీడర్‌గా పనిచేసింది. అనంతరం సీరియల్స్‌లో నటించింది. అక్కడ తానెంటో నిరూపించుకుని.. సినిమాల్లోకి వచ్చింది. స్వతహాగా ప్రియా భవాని శంకర్.. ఇంజినీరింగ్‌ స్టూడెంట్. కానీ గ్లామర్‌ రంగాన్ని ఎంచుకుంది. 

(ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు)

2017లో 'మేయాద మాన్‌' చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'కడైకుట్టి సింగం' తదితర చిత్రాల్లో నటించింది. ఎక్కువగా హోమ్లీ పాత్రలు చేసే ప్రియా భవాని శంకర్.. లారెన్స్‌తో కలిసి 'రుద్రన్‌' అనే సినిమాని గతేడాది చేసింది. ఇందులో అందాలను కాస్త ఎక్కువగానే చూపించింది. అలానే లిప్‌లాక్‌ సీన్స్‌లోనూ నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.  

అయితే కేవలం తమిళ వరకు మాత్రమే పరిమితమైపోకుండా తెలుగులోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉంది. గతేడాది సంక్రాంతికి 'కల్యాణం కమనీయం' సినిమాలో హీరోయిన్‌గా చేసింది. పెద్దగా కలిసిరాలేదు. డిసెంబరులో నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్‌లో మంచి పాత్ర చేసింది. ఇకపోతే గతేడాది ఐదు మూవీస్ చేసిన ఈ బ్యూటీ.. 2024లో ఏకంగా 5-6 సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. దీనిబట్టి చూస్తే ఈమెని ట్రెండింగ్ హీరోయిన్ అనొచ్చేమో!

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top