పాకీజాను వీడని ఆర్థిక కష్టాలు.. షాపుల వద్ద భిక్షాటన చేస్తూ! | Actress Pakeezah Begging At Tirumala Near By Shops Goes Viral | Sakshi
Sakshi News home page

Pakeezah Vasuki: అందరినీ నవ్వించిన పాకీజా.. ఇప్పడేమో భిక్షాటన చేస్తూ!

Sep 11 2023 6:17 PM | Updated on Sep 11 2023 6:47 PM

Actress Pakeezah Begging At Tirumala Near By Shops Goes Viral - Sakshi

పాకీజా అంటే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మెహన్‌బాబు నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రంలో తన పాత్రకు ప్రేక్షకులను మెప్పించింది. అలా తెరపై అందరినీ నవ్వించిన ఆమెకు నిజ జీవితంలో మాత్రం కష్టాలు వదలడం లేదు. తమిళనాడు సీఎం జయలలిత మరణం తర్వాత తన పరిస్థితి చాలా దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తినడానికి కూడా సరిగా తిండి లేక ఇబ్బందులు పడ్డామని వాపోయింది. ఆమె అసలు పేరు వాసుకి కాగా.. ఆ పాత్రకు వచ్చిన క్రేజ్‌తో పాకీజాగా మారిపోయింది. 

(ఇది చదవండి: దీనస్థితిలో పాకీజా.. అండగా నిలిచిన మంచు విష్ణు)

అయితే జీవితంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆమెకు టాలీవుడ్ ప్రముఖులు అండగా నిలిచారు. మెగా ఫ్యామిలీతో పాటు మా అసోసియేషన్‌ ఆమె సాయం చేశారు. అంతేకాకుండా మా అసోసియేషన్ తరఫున మంచు విష్ణు ఆమెకు గుర్తింపు కార్డును సైతం అందజేశారు. ఈ తరుణంలో మళ్లీ సినిమాల్లో అవకాశాలు వస్తాయన్న ఆశతో హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఇక్కడే ఉంటూ నగరంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. 

అయితే పాకీజాకు ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. సీరియల్స్‌తో పాటు కామెడీ షో ‍అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె కష్టాలను తీర్చలేకపోయాయి. ఎప్పటిలాగే ఆర్థిక ఇబ్బందులు పడుతోంది. దీంతో ఇంటికి అద్దె చెల్లించలేని పరిస్థితుల్లో తిరుపతిలో భిక్షాటన చేస్తూ కనిపించింది. తాను ఇంకా అర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంది. తిరుపతిలోని దుకాణాల యజమానులు ఇచ్చిన డబ్బులు తీసుకుంటూ కనిపించింది. ఒక ఆర్టిస్ట్‌గా అందరి నవ్వించిన వాసుకిని చూస్తే ఎవరికైనా అయ్యో పాపం అనకుండా ఉండలేరు. సినీ ఇండస్ట్రీలో అందరి జీవితాలు ఓకేలా ఉండవని ఆమె పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. 

(ఇది చదవండి: నా సొంతింటికి వచ్చినట‍్లు ఉంది.. చెన్నైకి వెళ్లను: సీనియర్ నటి పాకీజా)


  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement