Senior Actress Pakeezah Vasuki Home In Hyderabad - Sakshi
Sakshi News home page

Pakeezah Vasuki: నా సొంతింటికి వచ్చినట‍్లు ఉంది.. చెన్నైకి వెళ్లను: సీనియర్ నటి పాకీజా

May 2 2023 4:11 PM | Updated on May 2 2023 4:29 PM

Senior Actress Pakeezah Vasuki Home In Hyderabad - Sakshi

సినీ నటుల జీవితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. వారి జీవితంలో ఒడుదొడుకులు రావడం సహజం. ఇక కొందరి జీవితాలు మరీ దుర్భరమైన పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. అలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడిన వారిలో సీనియర్ నటి పాకీజా ఒకరు. ఆమె దీన స్థితిని చూసిన టాలీవుడ్ హీరోలు ఆమెకు సాయం కూడా చేశారు. మెగాస్టార్ చిరంజీవి, మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు అండగా నిలిచారు.

(ఇది చదవండి: చైతన్య మాస్టర్‌ ఆత్మహత్య.. శ్రద్దా దాస్‌, శేఖర్‌ మాస్టర్‌ ఎమోషనల్‌)

కొన్నేళ్లుగా చెన్నైలో ఉంటున్న ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే మళ్లీ వెండితెరపై ఆమెకు అవకాశాలు రావడంతో బిజీ అయిపోయారు. తెలుగులో మోహన్‌ బాబు నటించిన చిత్రం అసెంబ్లీ రౌడీతో ఆమె ఫేమస్ అయిపోయారు. 

(ఇది చదవండి: దీనస్థితిలో పాకీజా.. అండగా నిలిచిన మంచు విష్ణు)

అయితే ఆమె హైదరాబాద్‌లోనే అద్దెగదిలో ఉంటున్నారు.  గతంలో ఓ ఇంటర్వ్యూలో చెన్నైలో తాను చాలా ఇబ్బందులు పడినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు వచ్చాక ఆ పరిస్థితులు మారిపోయాయని తెలిపారు. ఇక్కడ అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారని ధన్యవాదాలు తెలిపారు. ఇక నుంచి హైదరాబాద్‌లోనే ఉంటానని.. చెన్నై వెళ్లనని సంతోషంగా చెబుతోంది పాకీజా వాసుకి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement