Jr. NTR Heroine Manjari Fadnis Latest Photos Viral - Sakshi
Sakshi News home page

Guess The Actress: ఈమె తెలుగు హీరోయిన్.. ఇప్పుడేమో ఇలా!

Aug 11 2023 5:08 PM | Updated on Aug 11 2023 6:10 PM

Actress Manjari Fadnis Latest Photos Viral - Sakshi

టాలీవుడ్‌లో హీరోయిన్లకు కొదవ లేదు. ప్రతి ఏడాది పదుల సంఖ్యలో వస్తూనే ఉంటారు. అయితే ఇందులో నిలదొక్కుకుని, హిట్స్ కొట్టి స్టార్స్ అయ్యేది మాత్రం చాలా తక్కువమంది. ఈ భామ కూడా అలానే ముంబయి నుంచి ఇక్కడికి వచ్చింది. కాకపోతే నాలుగే సినిమాలు చేసింది. అప్పుడు ఓ మాదిరిగా ఉండేది. ఇప్పుడేమో హాట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్‌లా మారిపోయింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు మంజరి ఫడ్నిస్. ముంబయిలో పుట్టి పెరిగిన ఈ భామ.. కెరీర్ లో ఎక్కువగా హిందీ సినిమాలే చేసింది. అలానే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ నటించింది. హీరోయిన్ హిందీలో ఫస్ట్ మూవీ 2004లో చేసిన ఈమె.. 2008లో తెలుగు సినిమా చేసింది. అల్లరి నరేశ్ 'సిద్దు ఫ్రమ్ సికాకుళం'లో హీరోయిన్‌గా చేసింది. ఇది హిట్ కాలేదు. అయినాసరే ఈమెకు అవకాశాలు వచ్చాయి.

(ఇదీ చదవండి: 'పోర్ తొళిల్' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ))

ఇంకోసారి, సుభద్రాపురం అనే తెలుగు చిత్రాల్లోనూ హీరోయిన్‌గా చేసిన మంజరి.. ఎన్టీఆర్-మెహర్ రమేశ్ కాంబోలో వచ్చిన 'శక్తి'లోనూ నటించింది. ఈ సినిమాలో ఎక్కడుందబ్బా అని ఆలోచిస్తున్నారేమో. కంగారు పడొద్దు. ఫ్లాష్ బ్యాక్‌లో ఎన్టీఆర్‌ భార్యగా యాక్ట్ చేసింది ఈమెనే. ఇది ఫెయిలవడంతో ఈ బ్యూటీకి తెలుగులో మరో ఛాన్స్ రాలేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసింది.

ప్రస్తుతం హిందీలోనే సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉన్న మంజరికి ఇప్పుడు 39 ఏళ్లు. అయినాసరే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే సింగిల్‌గానే ఉంటోంది. తెలుగులో సినిమాలు చేస్తున్నప్పుడు ఓ మాదిరిగా ఉన్న ఈమె.. వయసుతోపాటు గ్లామర్ కూడా తెగ పెంచేసుకుంటోంది. ఆమె లేటెస్ట్ ఫొటోలు చూసి నెటిజన్స్ షాకవుతున్నారు.

(ఇదీ చదవండి: 'భోళా శంకర్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!)

Advertisement
 
Advertisement
Advertisement