నీ మంచితనం నాకు తెలుసు.. తీవ్ర దుఃఖంలో లావణ్య త్రిపాఠి | Actress Lavanya Tripathi Pet Dog Passed Away | Sakshi
Sakshi News home page

Lavanya Tripathi: నీ మంచితనం నాకు తెలుసు.. చివరిచూపు చూసుకున్న హీరోయిన్‌

Jun 5 2025 6:51 PM | Updated on Jun 5 2025 7:19 PM

Actress Lavanya Tripathi Pet Dog Passed Away

హీరోయిన్‌, మెగా ఫ్యామిలీ కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) తీవ్ర బాధలో ఉంది. ఆమె ఎంతగానో ఇష్టపడే పెంపుడు శునకం మరణించింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. నేను చూసిన శునకాల్లో అన్నింటికంటే నువ్వే ఎంతో మంచిదానివి. నీకు శక్తి ఉండుంటే నాకోసం టీ పెట్టడానికి కూడా వెనకాడవని నా చుట్టూ ఉండేవాళ్లకు ఎప్పుడూ నీ గురించి చెప్తుంటాను. 

ఎంత మంచిదానివో..
నీదెంత మంచిమనసో నాకు తెలుసు. నువ్వు చాలా మంచిదానివి. అలాగే తెలివైనదానివి స్వీటీ అని రాసుకొచ్చింది. తన శునకంతో కలిసున్న ఫోటోలను షేర్‌ చేసింది. ఈ పోస్ట్‌ కింద సాయిదుర్గ తేజ్‌ ఓం శాంతి అని కామెంట్‌ చేశాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు.. లావణ్యను ధైర్యంగా ఉండమని చెప్తున్నారు.

త్వరలోనే తల్లి కాబోతున్న లావణ్య
కాగా లావణ్య త్రిపాఠి, వరుణ్‌ తేజ్‌ 2023లో పెళ్లి చేసుకున్నారు. గత నెలలోనే లావణ్య.. తాను గర్భం దాల్చినట్లు గుడ్‌న్యూస్‌ చెప్పింది. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె చేతిలో సతీ లీలావతి సినిమా ఉంది.

 

 

చదవండి: నా తల్లికి పుట్టుకతోనే చెవులు వినిపించవు..మోహన్‌బాబు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement