అక్కడ టాటూతో వీడియో.. గోల- గోల చేసిన సీరియల్‌ బ్యూటీ | Sakshi
Sakshi News home page

అక్కడ టాటూతో వీడియో.. గోల- గోల చేసిన సీరియల్‌ బ్యూటీ

Published Sat, Feb 10 2024 1:26 PM

Actress Jyothi Raj Tattoo Video Viral - Sakshi

తెలుగు బుల్లితెర నటి జ్యోతిరాయ్‌ టాటూ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెరపై ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో జగతి మేడమ్ పాత్రలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. స్వతహాగా కన్నడ అయినప్పటికీ తెలుగులో బోలెడంత ఫాలోయింగ్ సంపాదించింది. ఆల్రెడీ పెళ్లయిపోయిన ఈ బ్యూటీ కొన్నాళ్లుగా ఓ కుర్ర దర్శకుడితో రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. 

కర్ణాటకకు చెందిన జ్యోతిరాయ్.. ఇప్పటి వరకు 20కి పైగా సీరియల్స్‌లో అంటే తుళు, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో నటించింది. మరోవైపు వెబ్‌సిరీస్‌ల్లో హీరోయిన్‌గా చేస్తోంది. సీరియల్స్‌లలో చీర కట్టులో కనిపించే ఈ బ్యూటీ ఇన్‌స్టాలో మాత్రం అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనకాడదు. ఆమె అందాల ప్రదర్శనకు యూత్‌ గుండెల్లో హీట్‌ పుట్టిస్తు ఉంటుంది.

తాజాగా జ్యోతిరాయ్ తన ఛాతీకి దగ్గర్లో ఒక టాటూను వేయించుకున్నారు. అక్కడ లవ్‌ అనే అక్షరాలతో పాటు సీతాకోక చిలుక గుర్తు బయటికి కనిపించేలా మార్క్‌ ఉంది. ప్రస్తుతం ఆమె  'ఏ మాస్టర్ పీస్' చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్ర దర్శకుడు 'సుకు పుర్వాజ్‌'తో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ తన ఇన్‌స్టా అకౌంట్‌ను కూడా అతని పేరు కలిసేలా గతంలోనే మార్చేసుకున్నారు. ఇప్పుడు తన ఛాతీపై కూడా అతనిపై ప్రేమతోనే టాటూ వేయించుకున్నారని కామెంట్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ వీడియో నెట్టిట తెగ వైరల్‌ అవుతుంది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement