హీరో పక్కన నీ ఏడుపేంటి?.. దృశ్యం నటిపై ట్రోలింగ్‌ | Actress Esther Anil Counter to Troll amid Drishyam 3 Success | Sakshi
Sakshi News home page

Esther Anil: ఆయన చాలా చూశాడు, మధ్యలో నీ ఏడుపేంటి?.. ట్రోలర్‌కు నటి కౌంటర్‌

May 24 2026 3:15 PM | Updated on May 24 2026 3:30 PM

Actress Esther Anil Counter to Troll amid Drishyam 3 Success

ఎస్తర్‌ అనిల్‌.. మలయాళంలో అనేక సినిమాలు చేసినప్పటికీ దృశ్యం నటిగానే ఎక్కువ ఫేమస్‌. దృశ్యం మూడు భాగాల్లోనూ హీరో చిన్న కూతురిగా నటించింది. మలయాళంతో పాటు తెలుగు దృశ్యం మూవీలోనూ యాక్ట్‌ చేసింది. ఇకపోతే మోహన్‌లాల్‌ దృశ్యం 3 ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే! ఈ సినిమా ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఏడ్చేసిన దృశ్యం నటి
ఇక సినిమా రిలీజైనరోజు చిత్రయూనిట్‌ థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకుల రెస్పాన్స్‌ కళ్లారా చూసింది. ఈ సమయంలో మోహన్‌లాల్‌ పక్కనే కూర్చున్న ఎస్తర్‌ సంతోషంతో ఏడ్చేసింది. తనకు తెలియకుండా వస్తున్న కన్నీళ్లను తుడుచుకునే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే ఈ వీడియో కింద ఓ నెటిజన్‌ ఎస్తర్‌కు వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 

నటి కౌంటర్‌
డియర్‌.. ఆయన కెరీర్‌లో ఇలాంటివి చాలా చూశాడు.. ఇంతకంటే పెద్ద విజయాలు కూడా అందుకున్నాడు. కానీ, నువ్వేంటి? ఆయన పక్కన ఇలా ఏడుస్తూ కూర్చున్నావ్‌? అని సెటైర్‌ వేశాడు. ఈ కామెంట్‌ ఎస్తర్‌ కంట పడింది. దాన్ని అలాగే చూసి వదిలేయలేదు. మధ్యలో నీకేంటి సమస్య? అని రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు అతడికి బాగా బుద్ధి చెప్పావ్‌ అని నటికి సపోర్ట్‌ చేస్తున్నారు.

చదవండి: 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ.. ఎవరూ గుర్తుపట్టట్లే.. ఇంకెందుకు బతకడం?: నటి

Advertisement
 
Advertisement
Advertisement