బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలపై బహిరంగంగా స్పందించింది. సెలీనా ఆస్తులన్నింటినీ తన భర్త పీటర్ హాగ్ బదలాయించుకున్నారని ఆమె ఆరోపించింది. తన వైవాహిక బంధం అత్యంత వివాదాస్పదమైంది. దాంతో పెళ్లి చేసుకునే యువతులకు ఒక ముఖ్యమైన సూచన చేసింది. 
సెలీనా జైట్లీ మాటల్లో.. మీకు సొంతంగా ఆస్తులు ఉంటే దయచేసి పెళ్లికి ముందే అతడితో ఓ ఒప్పందం చేసుకోండి. మీ ఆస్తులను ఎప్పుడూ విడిగానే ఉంచుకోండి. ఎందుకంటే చివరికి అంతా ఆస్తుల చుట్టూనే తిరుగుతుందని చెప్పింది. 2010లో ఆస్ట్రియాకు చెందిన వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ను సెలీనా వివాహం చేసుకుంది. వీరికి విన్‌స్టన్, విరాజ్, ఆర్థర్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. మరో కుమారుడు షంషేర్ గుండె సమస్యతో చిన్న వయసులోనే మరణించాడు. 
తన 15వ వివాహ వార్షికోత్సవం రోజే విడాకుల పత్రాలు “బహుమతి”గా అందాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నా రూ. 20 కోట్ల విలువైన ఆస్తులను హాగ్ తన పేరిట రాయించుకున్నాడు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తుల్నీ కూడా హాగ్ బదలాయించుకున్నాడని సెలీనా ఆరోపిస్తోంది. ఇక సెలీనా సినీ రంగంలో ఆరేళ్ల విరామం తర్వాత ‘సిస్టర్ నివేదిత’ సినిమాతో బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తోంది. సెలీనా గతంలో తెలుగు, కన్నడ సినిమాల్లోనూ నటించింది.
ఈ సందర్భంలో ఆమె ఇచ్చిన సలహా పెళ్లి చేసుకునే ముందు ముఖ్యంగా సొంత ఆస్తులు ఉన్న యువతులు, తప్పనిసరిగా ప్రీ-నప్షియల్ అగ్రిమెంట్ చేసుకోవాలి. తద్వారా భవిష్యత్తులో భర్తతో మోసపోకుండా ఉండగలరని సూచించింది.


