లెనిన్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌.. యాంకర్‌ సుమకు బ్రహ్మాజీ ఫన్నీ వార్నింగ్ | Lenin pre-release event Brahmaji funny warning to Anchor Suma | Sakshi
Sakshi News home page

లెనిన్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌.. యాంకర్‌ సుమకు బ్రహ్మాజీ ఫన్నీ వార్నింగ్

Jul 5 2026 11:19 PM | Updated on Jul 5 2026 11:19 PM

Lenin pre-release event Brahmaji funny warning to Anchor Suma

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవ‌ర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు ముర‌ళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు.

తిరుపతిలో ఆదివారం సాయంత్రం జరిగిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున, అఖిల్, భాగ్యశ్రీ, నాగవంశీ, సునీల్, బ్రహ్మాజీ, శివాజీ తదితరులు పాల్గొన్నారు. హోస్ట్‌గా వ్యవహరించిన యాంకర్ సుమ కనకాల తనదైన శైలిలో సరదా మాటలతో వేదికను కాసేపు నవ్వుల పండుగగా మార్చారు.

ఈవెంట్‌లో సుమ తరచుగా చేసేలా బ్రహ్మాజీపై జోకులు వేస్తూ, ఆయన వయసు గురించి సెటైర్లు వేశారు. బ్రహ్మాజీ తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో కుంటి దామోదరం అనే నెగిటివ్ రోల్ పోషించానని చెప్పారు. స్టేజ్‌పైనే కుంటుకుంటూ తన నటనను ప్రదర్శించారు. దానికి సుమ వావ్.. బ్యూటిఫుల్.. మీరు నటించాల్సిన అవసరం లేదు.. జీవిస్తున్నారంటూ సరదాగా వ్యాఖ్యానించారు. 

దానికి ప్రతిస్పందనగా బ్రహ్మాజీ స్టేజ్‌పైనే సీరియస్ ఫేస్ పెట్టి, కమ్ టు మై రూమ్ అంటూ సుమ వైపు వేలు చూపించారు. దాంతో ఒక్కసారిగా షాక్ అయిన సుమ వెంటనే అన్నయ్యా.. అంటూ కవర్ చేశారు. తన ఉద్దేశ్యం అది కాదని  ప్రభాస్ పాపులర్ మీమ్‌ను గుర్తు చేశారు. 'ఆదిపురుష్' సినిమా టైంలో కమ్ టు మై రూమ్ అంటూ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ఆ చిత్ర దర్శకుడు ఓం రౌత్‌ను పిలవడం అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అదే డైలాగ్‌ను ఇప్పుడు బ్రహ్మాజీ సరదాగా సుమపై వాడటంతో ఈవెంట్‌లో నవ్వులు పూశాయి.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement