టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్ | Actress Deviyani Sharma Mobile Hacked | Sakshi
Sakshi News home page

Deviyani Sharma: ఫోన్ హ్యాక్.. మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్న నటి

May 8 2024 3:13 PM | Updated on May 8 2024 3:58 PM

Actress Deviyani Sharma Mobile Hacked

'సేవ్ ద టైగర్స్', 'సైతాన్' సిరీస్‌లతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న దేవయాని శర్మకు ఇప్పుడు ఊహించని కష్టం వచ్చి పడింది. ఆమె ఉపయోగిస్తున్న ఫోన్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. దీని వల్ల మానసికంగా తాను ఎంతో బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తన నంబర్ నుంచి ఎలాంటి మెసేజ్ వచ్చినా సరే స్పందించొద్దని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

(ఇదీ చదవండి: తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?)

దేవయాని ఏం చెప్పింది?

'కొన్నిరోజుల క్రితం నా ఫోన్ హ్యాక్ అయింది. నా వ్యక్తిగత సమాచారం అంతా వాళ్ల దగ్గరే ఉంది. అయితే ఇది ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకైతే తెలీదు. కానీ ఈ విషయాన్ని ఇప్పుడు చెబుతున్నాను. అలానే నా వాట్సాప్ కూడా హ్యాక్ అయింది. ఎందుకంటే ఫోన్‌లో మార్పులు కనిపిస్తున్నాయి. ఒకవేళ నా నంబర్ నుంచి ఎవరికైనా ఎలాంటి మెసేజులు వచ్చినా స్పందించొద్దు. ఎందుకంటే అది నేను కాదు'

'ఇప్పటికే దీని వల్ల మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. అలానే మూడుసార్లు ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. కాబట్టి నా నంబర్ నుంచి ఎలాంటి మెసేజులు వచ్చిన చేస్తున్నది నేను కాదని అర్థం చేసుకోండి. వీలైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. అయితే ఇదేదే నా పరువు తీసి, చెడుగా ప్రాజెక్ట్ చేసే ఉద్దేశంతో చేస్తున్నారని అనిపిస్తుంది. మామూలుగానే ఆర్టిస్ట్ జీవితం కష్టంగా ఉంటుంది. ఇలాంటి వాటితో మరింత కష్టంగా మారుతోంది' అని దేవయాని తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. 

(ఇదీ చదవండి: ఆ మాట అనగానే నాకు కోపం వచ్చేసింది: అల్లు అర్జున్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement