కమెడియన్ సప్తగిరి ఇంట్లో విషాదం | Tollywood Actor And Comedian Saptagiri Mother Passed Away, Check His Tweet Inside | Sakshi
Sakshi News home page

Saptagiri: విషాదం.. బాధలో కమెడియన్ సప్తగిరి

Apr 9 2025 9:28 AM | Updated on Apr 9 2025 10:01 AM

Actor Saptagiri Mother Passed Away

తెలుగులో పలు సినిమాల్లో నటించి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఇతడి తల్లి చిట్టెమ్మ.. మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో సప్తగిరి వెల్లడించాడు.

(ఇదీ చదవండి: తమన్నాని పరిచయం చేసిన నిర్మాత కన్నుమూత)

బుధవారం (ఏప్రిల్ 9) నాడు తిరుపతిలో తల్లి అంత్యక్రియలు నిర్వహిస్తామని సప్తగిరి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే పలువురు నటీనటులు సప్తగిరికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

సప్తగిరి విషయానికొస్తే.. ఇతడి అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. 2006లో బొమ్మరిల్లు సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. పరుగు, గబ్బర్ సింగ్, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, సలార్.. ఇలా 100-150కి పైగా సినిమాలు చేశాడు. రీసెంట్ గా 'పెళ్లికాని ప్రసాద్' అనే మూవీతో హీరోగానూ చేశాడు. ఇతడు నటించిన కన్నప్ప.. విడుదల కావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?)

Advertisement
 
Advertisement
Advertisement