ఆ సినిమా తరువాత అంత గొప్ప పాత్ర ఇదే: రాజేంద్ర ప్రసాద్ | Actor Rajendra Prasad To Play Key Role In Laggam Movie | Sakshi
Sakshi News home page

Rajendra Prasad: ఎప్పటికీ మరిచిపోలేని పాత్ర చేస్తున్నా: రాజేంద్ర ప్రసాద్

Feb 5 2024 3:12 PM | Updated on Feb 5 2024 3:41 PM

Actor Rajendra Prasad Key Role In Latest Movie Laggam in Tollywood - Sakshi

సాయి రోనక్, గనవి లక్ష్మణ్ నటిస్తోన్న తాజా చిత్రం 'లగ్గం'. భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో ఫేమ్ తెచ్చుకున్నచెప్పాల రమేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటిస్తున్నారు. సుభిశి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 

ఈ సందర్భంగా నటుడు రాజేంద్రప్రసాద్ ప్రసాద్ మాట్లాడుతూ...'లగ్గం సినిమాలో ఎవ్వరు, ఎప్పటికీ మరిచిపోలేని పాత్ర చేస్తున్నా. నా కెరీర్‌లో పెళ్లి పుస్తకం తరువాత అంత గొప్ప పాత్ర ఈ సినిమాలో చేస్తుండడం మరో విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారందరికీ ఈ కథనాలు కనెక్ట్ అవుతాయి. మొత్తంగా లగ్గం విందు భోజనం లాంటి సినిమా' అని అన్నారు. దర్శకుడు రమేష్ చెప్పాల మాట్లాడుతూ.. "పెళ్లి చేసుకోవడం అంటే రెండు కుటుంబాలు కలవడం కాదు. రెండు మనసులు కలవడం అంటూ  గట్టి దావత్ ఇవ్వబోతున్నాం అని అన్నారు. 

హీరో సాయి రోనక్ మాట్లాడుతూ.. "ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎప్పటికీ మరిచిపోలేని ట్రీట్ ఇవ్వబోతున్నాం. ఈ సినిమాలో వినోదంతో పాటు ఎమోషన్స్, తెలంగాణ పెళ్లి కల్చర్  ప్రతి ఒక్కరికి  వాళ్ల లగ్గాన్ని గుర్తు చేస్తుంది. పెళ్లి కాని వారికి ఇలా లగ్గం చేసుకోవాలనిపిస్తుంది." అన్నారు. కాగా.. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య, లక్ష్మణ్ మీసాల, ప్రభావతి. కంచరపాలెం రాజు, సత్తన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement