దీనస్థితిలో తెలుగు సీనియర్ నటుడు.. మరో నటుడు ఆర్థిక సాయం | Sakshi
Sakshi News home page

దీనస్థితిలో తెలుగు సీనియర్ నటుడు.. మరో నటుడు ఆర్థిక సాయం

Published Fri, Jan 12 2024 3:38 PM

Actor Kadambari Kiran Helps Actor Veerabhadrayya - Sakshi

ప్రముఖ సినీ నటుడు, 'మనం సైతం' ఫౌండేషన్ నిర్వ‌హ‌కులు కాదంబ‌రి కిర‌ణ్ మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. మంచానికే పరిమితమైన పావలా శ్యామలకు కొన్నిరోజుల క్రితం ఆర్థిక సాయం చేసిన ఈయన.. ప్ర‌మాదానికి గురై ఆందోళ‌న‌క‌రమైన ప‌రిస్థితుల్లో హ‌స్పిట‌ల్‌లో చేరిన తెలుగు సీనియర్ న‌టుడు డీ. వీర‌భ‌ద్ర‌య్య‌కు రూ. 25,000 చెక్ అందజేశారు. 

(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు మూవీ)

వీర‌భ‌ద్ర‌య్య‌కు మెరుగైన వైద్యం, క‌నీస అవ‌స‌రాల‌ను తీర్చేందుకుగానూ కాదంబరి కిరణ్ ఈ సాయం చేశారు. అలానే వీరభద్రయ్య కుటుంబ స‌భ్యుల‌ని ఓదార్చుతూ, వారిలో కాస్త ధైర్యం నింపారు. ఇకపోతే కాదంబరి కిరణ్.. గత కొన్నేళ్లుగా 'మనం సైతం' ఫౌండేషన్ తరఫున ఇండస్ట్రీలోని పేద కార్మికులకు, అవసరాల్లో ఉన్న పేదలకు తోచినంత సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు ఈయన్ని ప్రశంసిస్తున్నారు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)

Advertisement
 
Advertisement
 
Advertisement