జాతీయ సినీ అవార్డులు.. ప్రైజ్‌మనీ ఎంత? ఎవరికి ఏమేం ఇస్తారంటే? | 71st National Film Awards Winners List And There Prize Money Details | Sakshi
Sakshi News home page

జాతీయ అవార్డుల ప్రైజ్‌మనీ.. హనుమాన్‌ డైరెక్టర్‌కు ఎక్కువ.. బేబీ డైరెక్టర్‌కు తక్కువ!

Aug 2 2025 2:35 PM | Updated on Aug 2 2025 3:03 PM

71st National Film Awards Winners List And There Prize Money Details

జాతీయ చలనచిత్ర అవార్డుల్లో టాలీవుడ్‌ హవా కనిపించింది. 71వ జాతీయ సినీ అవార్డుల్లో (National Film Awards 2025) టాలీవుడ్‌ ఏడు పురస్కారాలను ఎగరేసుకుపోయింది. 2023లో జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు సెన్సార్‌ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ అవార్డులు ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్‌ నిలవగా.. ఉత్తమ నటుడిగా షారూఖ్‌ ఖాన్‌ (జవాన్‌), విక్రాంత్‌ మాస్సే (12th ఫెయిల్‌) అవార్డులు కొల్లగొట్టారు. 

అయితే వీరిద్దరూ రూ.2 లక్షల పురస్కారాన్ని చెరిసగం పంచుకోవాల్సి ఉంది. మిసెస్‌ చటర్జీ వర్సెస్‌ నార్వే సినిమాకుగానూ రాణీ ముఖర్జీకి ఉత్తమ నటి పురస్కారం వరించింది. అవార్డుతో పాటు రూ.2 లక్షలు అందుకోనుంది. వీళ్లందరికీ ఇదే తొలి జాతీయ అవార్డు కావడం విశేషం! తెలుగు చలనచిత్రసీమకు ఏయే విభాగంలో జాతీయ అవార్డులు వచ్చాయి? వారికి ఎంత ప్రైజ్‌మనీ అందుతుందనే వివరాలను చూసేద్దాం..

వారికి బంగారు పతకం
2024 సంక్రాంతికి విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘హను–మాన్‌’ సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. ఏవీజీసీ (యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్స్, గేమింగ్‌ అండ్‌ కామిక్‌), బెస్ట్‌ యాక్షన్‌ డైరెక్షన్‌ (స్టంట్‌ కొరియోగ్రఫీ) విభాగంలో పురస్కారాలు వచ్చాయి. దీంతో దర్శకుడు ప్రశాంత్‌ వర్మకు, యానిమేటర్‌ జెట్టి వెంకట్‌ కుమార్‌కు బంగారు పతకంతో పాటు రూ.3 లక్షల నగదు చొప్పున అందజేయనున్నారు. జెట్టి వెంకట్‌ కుమార్‌.. వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌గానూ వ్యవహరించినందున అతడికి మరో వెండి పతకంతో పాటు మరో రూ.2 లక్షలు ఇవ్వనున్నారు. స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ నందు పృథ్వీ వెండి పతకంతో పాటు రూ.2 లక్షలు తీసుకోనున్నాడు.

బేబీ సింగర్‌కు రూ.2 లక్షలు
‘గాంధీతాత చెట్టు’ సినిమాకుగాను సుకృతికి ఉత్తమ బాలనటి పురస్కారం వరించింది. అయితే ఈ కేటగిరీలో మరో ఇద్దరికి అవార్డులు రావడంతో.. రూ.2 లక్షల ప్రైజ్‌మనీని ఈ ముగ్గురూ సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. బేబీ మూవీలో ప్రేమిస్తున్నా... పాటకు పీవీఎస్‌ఎన్‌ రోహిత్‌కు ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డు వరించింది. ఇతడికి వెండి పతకంతో పాటు రూ.2 లక్షలు రానున్నాయి.

బేబీ డైరెక్టర్‌కు రూ.1 లక్ష ప్రైజ్‌మనీ
బెస్ట్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో బేబీ రచయిత సాయి రాజేశ్‌తో పాటు మరో తమిళ దర్శకుడికి అవార్డు వరించింది. దీంతో అతడితో కలిసి రూ.2 లక్షల బహుమానాన్ని సమంగా పంచుకోవాల్సి ఉంటుంది. వీరికి వెండి పతకాలు బహుకరిస్తారు. బలగం సినిమాలో ‘ఊరు పల్లెటూరు..’ పాట రచయిత కాసర్ల శ్యామ్‌ బెస్ట్‌ లిరిక్‌ రైటర్‌గా వెండి పతకంతో పాటు రూ.2 లక్షలు అందుకోనున్నాడు. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్‌ కేసరి నిలిచింది. షైన్‌ స్క్రీన్స్‌ నిర్మాతలతో దర్శకుడు అనిల్‌ రావిపూడి రూ.2 లక్షల ప్రైజ్‌మనీని సమానంగా పంచుకోనున్నాడు.

చదవండి: బుల్లితెర నటి ఇంట విషాదం.. 'నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement