breaking news
National Film Awards
-
జాతీయ సినీ అవార్డులు.. ప్రైజ్‌మనీ ఎంత? ఎవరికి ఏమేం ఇస్తారంటే?
జాతీయ చలనచిత్ర అవార్డుల్లో టాలీవుడ్ హవా కనిపించింది. 71వ జాతీయ సినీ అవార్డుల్లో (National Film Awards 2025) టాలీవుడ్ ఏడు పురస్కారాలను ఎగరేసుకుపోయింది. 2023లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ అవార్డులు ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ నిలవగా.. ఉత్తమ నటుడిగా షారూఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్) అవార్డులు కొల్లగొట్టారు. అయితే వీరిద్దరూ రూ.2 లక్షల పురస్కారాన్ని చెరిసగం పంచుకోవాల్సి ఉంది. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమాకుగానూ రాణీ ముఖర్జీకి ఉత్తమ నటి పురస్కారం వరించింది. అవార్డుతో పాటు రూ.2 లక్షలు అందుకోనుంది. వీళ్లందరికీ ఇదే తొలి జాతీయ అవార్డు కావడం విశేషం! తెలుగు చలనచిత్రసీమకు ఏయే విభాగంలో జాతీయ అవార్డులు వచ్చాయి? వారికి ఎంత ప్రైజ్‌మనీ అందుతుందనే వివరాలను చూసేద్దాం..వారికి బంగారు పతకం2024 సంక్రాంతికి విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘హను–మాన్’ సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. ఏవీజీసీ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్), బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ) విభాగంలో పురస్కారాలు వచ్చాయి. దీంతో దర్శకుడు ప్రశాంత్ వర్మకు, యానిమేటర్ జెట్టి వెంకట్ కుమార్‌కు బంగారు పతకంతో పాటు రూ.3 లక్షల నగదు చొప్పున అందజేయనున్నారు. జెట్టి వెంకట్ కుమార్.. వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్‌గానూ వ్యవహరించినందున అతడికి మరో వెండి పతకంతో పాటు మరో రూ.2 లక్షలు ఇవ్వనున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ నందు పృథ్వీ వెండి పతకంతో పాటు రూ.2 లక్షలు తీసుకోనున్నాడు.బేబీ సింగర్‌కు రూ.2 లక్షలు‘గాంధీతాత చెట్టు’ సినిమాకుగాను సుకృతికి ఉత్తమ బాలనటి పురస్కారం వరించింది. అయితే ఈ కేటగిరీలో మరో ఇద్దరికి అవార్డులు రావడంతో.. రూ.2 లక్షల ప్రైజ్‌మనీని ఈ ముగ్గురూ సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. బేబీ మూవీలో ప్రేమిస్తున్నా... పాటకు పీవీఎస్ఎన్ రోహిత్‌కు ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డు వరించింది. ఇతడికి వెండి పతకంతో పాటు రూ.2 లక్షలు రానున్నాయి.బేబీ డైరెక్టర్‌కు రూ.1 లక్ష ప్రైజ్మనీబెస్ట్ స్క్రీన్‌ప్లే విభాగంలో బేబీ రచయిత సాయి రాజేశ్‌తో పాటు మరో తమిళ దర్శకుడికి అవార్డు వరించింది. దీంతో అతడితో కలిసి రూ.2 లక్షల బహుమానాన్ని సమంగా పంచుకోవాల్సి ఉంటుంది. వీరికి వెండి పతకాలు బహుకరిస్తారు. బలగం సినిమాలో ‘ఊరు పల్లెటూరు..’ పాట రచయిత కాసర్ల శ్యామ్ బెస్ట్ లిరిక్ రైటర్‌గా వెండి పతకంతో పాటు రూ.2 లక్షలు అందుకోనున్నాడు. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి నిలిచింది. షైన్ స్క్రీన్స్ నిర్మాతలతో దర్శకుడు అనిల్ రావిపూడి రూ.2 లక్షల ప్రైజ్‌మనీని సమానంగా పంచుకోనున్నాడు.చదవండి: బుల్లితెర నటి ఇంట విషాదం.. 'నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది -
ప్రేక్షకుల కళ్లు నా కలర్ మీద నుంచి కాళ్లవైపు మళ్లాయి: నటుడు మిథున్ చక్రవర్తి
‘‘నా చర్మపు రంగు నలుపుగా ఉండటం అనేది నా కెరీర్ ఆరంభంలో పెద్ద సవాల్‌లా అనిపించింది. నల్లగా ఉన్నవారు నటులుగా ఇండస్ట్రీలో నెగ్గుకురావడం కష్టమన్నట్లు కొందరు మాట్లాడారు. ఇండస్ట్రీ నుంచి వెనక్కి వెళ్లమని కూడా సలహా ఇచ్చారు. ఒకానొక దశలో నా చర్మపు రంగును మార్చమని ఆ దేవుణ్ణి ప్రార్థించాను. ఆ తర్వాత అసలు నేనేం చేయగలను? నా బలం ఏంటి? అని ఆలోచించాను. నేను బాగా డ్యాన్స్ చేయగలనని నా బలం తెలుసుకున్నాను.మంచి డ్యాన్సర్ కావాలనుకున్నాను. అప్పుడు ప్రేక్షకుల కళ్లు నా కలర్ మీద నుంచి కాళ్ల వైపు మళ్లుతాయని అనుకున్నాను. ప్రేక్షకులు నా డ్యాన్స్‌ను అభిమానించడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారు నా కలర్‌ను మర్చిపోయారు. నేనో సెక్సీ డ్యాన్సర్‌గా, డస్కీ బెంగాలీ బాబుగా పేరు సంపాదించుకున్నాను’’ అని ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం స్వీకరించిన అనంతరం ఒకింత ఉద్వేగంగా మాట్లాడారు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి. దేశ రాజధాని ఢిల్లీలో 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం జరిగింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. 2022 సంవత్సరానికిగాను ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం ‘ఆట్టమ్’ (మలయాళం), ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి (కాంతార–కన్నడ), ఉత్తమ నటీమణులుగా నిత్యా మీనన్ (తిరుచిత్రంబలం–తమిళ్), మానసీ పరేఖ్ (కచ్ఎక్స్ప్రెస్–గుజరాతీ) అవార్డు అందుకున్నారు. తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు ‘కార్తికేయ 2’కు దక్కింది. నిర్మాత అభిషేక్ అగర్వాల్ అవార్డు స్వీకరించగా, చిత్రదర్శకుడు చందు మొండేటి, హీరో నిఖిల్ కూడా హాజరయ్యారు. ‘΄పొన్నియిన్ సెల్వన్– 1’కు గానూ ఉత్తమ సంగీతం (నేపథ్య సంగీతం) విభాగంలో ఏఆర్ రెహమాన్ అవార్డు అందుకున్నారు. ఈ వేడుకకు వివిధ భాషల నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ వేదికపై ఇంకా మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ – ‘‘ఇప్పటికి మూడు జాతీయ అవార్డులు అందుకున్నాను. తొలి అవార్డు (‘మృగయా’) అందుకున్నప్పుడే నేను చాలా సాధించాననుకున్నాను. ‘మృగయా’ సినిమా స్క్రీనింగ్‌కి వెళ్లినప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్... అతను ఈ లోకంలో లేడు కాబట్టి పేరు చెప్పను. అతను ‘ఈ సినిమా చాలా బాగుంది. నువ్వు అద్భుతమైన నటుడివి. కానీ ఇలాంటి బట్టలతో నువ్వు ఎలా కనిపిస్తున్నావో తెలుసా?’ అంటే నేను నిర్ఘాంతపోయాను.నేను ఆయన ముందు నగ్నంగా నిలబడ్డానా? అనిపించింది. వెంటనే ఆయన ‘మృగయా’లో నేను చేసిన ఆదివాసీ పాత్ర గురించి చెప్పినట్లు పేర్కొన్నారు. నేను నా తొలి జాతీయ అవార్డు అందుకున్న తర్వాత హాలీవుడ్ యాక్టర్ అల్ పచీనో అంతటి ప్రతిభ నాలోనూ ఉందనుకున్నాను. అకస్మాత్తుగా నా తీరు మారిపోయింది. కొందరు నిర్మాతలతో దురుసుగా ప్రవర్తించాను. నన్ను నేను అల్ పచీనో అనుకుం టున్నానని నిర్మాతలు గ్రహించలేకపోయారు. ఓ సందర్భంలో ఒక నిర్మాతకు కథను నా ఇంటికి పంపాలన్నాను. అతను వెంటనే లేచి నా చెంప చెళ్లుమనిపించాడు. అప్పట్నుంచి నన్ను నేను ఓ అల్ పచీనోలా ఊహించుకోవడం మానేశాను. నాదే తప్పని గ్రహించాను. నా తీరు మార్చుకున్నాను’’ అన్నారు.మంచి మార్పు తీసుకురావాలన్నదే...: రిషబ్ శెట్టిప్రతి సినిమా ప్రభావం ప్రేక్షకుల పై ఉంటుంది. అందుకే ప్రజల్లో, సమాజంలో మంచి మార్పును తీసుకువచ్చే సినిమాలు తీయాలన్నది నా ఉద్దేశం.కష్టానికి ప్రతిఫలం దక్కింది: నిత్యా మీనన్ చిత్రపరిశ్రమలో దాదాపు 15 ఏళ్ల కష్టం నాది. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ అవార్డు. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి దీన్ని బాధ్యతగా చూడకుండా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. ‘తిరుచిత్రంబలం’ బృందానికి, నా సహ నటులకు ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను. ఇదే ఉత్సాహంతో మంచి దర్శకులు, రచయితలతో కలిసి పని చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను. సినిమాకి సరిహద్దులు లేవు: ఏఆర్ రెహమాన్ సినిమాకి ప్రాంతం, భాష అంటూ ఎలాంటి సరిహద్దులు లేవు. నేను అందుకున్న ఏడో జాతీయ అవార్డు ఇది. సంతోషంగా ఉంది. ఈ అవార్డు నాకు వచ్చేందుకు కారకులైన ఫిల్మ్ మేకర్స్‌కి, ముఖ్యంగా డైరెక్టర్ మణిరత్నంగారికి ధన్యవాదాలు. -
జాతీయ అవార్డ్ గెలుచుకున్న సినిమాలు.. ఏయే ఓటీటీల్లో?
70 జాతీయ అవార్డులని కేంద్రం తాజాగా శుక్రవారం ప్రకటించింది. 2022 డిసెంబరు 31లోపు సెన్సార్ పూర్తయిన చిత్రాలకుగానూ పురస్కార విజేతలు ఎవరెవరనేది అనౌన్స్ చేశారు. తెలుగు నుంచి 'కార్తికేయ 2' మాత్రమే ప్రాంతీయ చిత్రం కేటగిరీలో అవార్డ్ దక్కించుకుంది. మలయాళ, తమిళ సినిమాలదే పూర్తిగా ఆథిపత్యం. ఇంతకీ ఈ మూవీస్ అన్నీ ఏయే ఓటీటీల్లో ఉన్నాయి? అనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల పూర్తి లిస్ట్)నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్- ఓటీటీఉత్తమ చిత్రంగా నిలిచిన మలయాళ సినిమా 'ఆట్టమ్'.. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టిని నిలబెట్టిన 'కాంతార'.. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.ఉత్తమ నటిగా నిత్యా మీనన్ చేసిన 'తిరు' సన్ నెక్స్ట్లో, మానసి పరేఖ్ 'కచ్ ఎక్స్‌ప్రెస్' షీమారో మీ అనే ఓటీటీలో ఉంది.ప్రాంతీయ చిత్రాల విభాగంలో.. కార్తికేయ 2(తెలుగు) జీ5లో ఉంది. పొన్నియిన్ సెల్వన్-1 (తెలుగు-తమిళ) అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.సౌది వెళ్లక్క సీసీ 225య/2009 (మలయాళ) చిత్రం సోనీ లివ్‌లో ఉంది.వాల్వీ (మరాఠీ).. అమెజాన్ ప్రైమ్, జీ5 ఓటీటీల్లో ఉంది.కబేరి అంతర్జాన్ (బెంగాలీ).. జియో సినిమా ఓటీటీలో ఉంది.గుల్ మోహర్ (హిందీ).. హాట్ స్టార్‌లో ఉంది.ఉత్తమ దర్శకుడు విభాగంలో సూరజ్ బర్జాత్యాకి అవార్డు వచ్చిన 'ఊంచాయ్'.. జీ5లో ఉంది.విజువల్ ఎఫెక్ట్స్, ప్లే బ్యాక్ సింగర్ తదితర కేటగిరీల్లో విజేతగా నిలిచిన 'బ్రహ్మస్త్ర'.. హాట్‌స్టార్‌లో ఉంది.ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో అవార్డ్ గెలిచిన 'కేజీఎఫ్ 2'.. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.ఉత్తమ మేకప్, ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో గెలిచిన బెంగాలీ మూవీ 'అపరాజితో'.. జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.ఉత్తమ బాలనటుడిగా నిలిచిన శ్రీపాథ్ నటించిన 'మలికాపురమ్'.. హాట్‌స్టార్‌లో ఉంది.(ఇదీ చదవండి: 'తంగలాన్' సినిమా రివ్యూ)