మెదక్‌జోన్: శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని సమాజం ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటుందని కలెక్టర్ ప్రతిమాసింగ్ కొనియాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరై అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి మాట్లాడారు. ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించి అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి త్యాగాలను గుర్తించడం ప్రతీ ఒక్కరి బాధ్యతన్నారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 14 మంది పోలీసులు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో ప్రాణత్యాగం చేసి అమరులయ్యారని తెలిపారు. వారు ప్రజల రక్షణ, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగానే ప్రజలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని తెలిపారు. అనంతరం పోలీసు అమరవీరుల కుటుంబాలకు కలెక్టర్, ఎస్పీ గిఫ్ట్ ప్యాక్‌లను అందజేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్


