సాయన్న స్ఫూర్తిని భావితరాలకు అందించాలి | - | Sakshi
Sakshi News home page

సాయన్న స్ఫూర్తిని భావితరాలకు అందించాలి

Oct 23 2026 7:18 AM | Updated on Oct 23 2026 7:18 AM

సాయన్న స్ఫూర్తిని భావితరాలకు అందించాలి నీటిని పొదుపుగా వాడుకోవాలి పంటలసాగులో నీటిని పొదుపుగా వాడాలి

మెదక్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి

నీలం మధు ముదిరాజ్‌

పటాన్‌చెరు టౌన్‌: తెలంగాణ రాబిన్‌హుడ్‌గా ప్రజల హృదయాల్లో నిలిచిన పండుగ సాయన్న ముదిరాజ్‌ చరిత్రను భావితరాలకు అందించాలని మెదక్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన 174వ పండుగ సాయన్న జయంతి వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరై నివాళులర్పించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజా పోరాట యోధుల చరిత్రకు గుర్తింపు కల్పించడం అభినందనీయమన్నారు. పండుగ సాయన్న వంటి మహనీయుల జీవితాలను యువతకు పరిచయం చేయడం ద్వారా సామాజిక చైతన్యం, సేవాభావం పెంపొందుతాయని పేర్కొన్నారు. ముదిరాజులను బీసీ–డీ నుంచి బీసీ–ఏ లోకి మార్చడం, ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటు చేయాలన్న అంశాల పై సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ సందర్భంగా నీలం మధు అమ్మవారి విగ్రహాన్ని బహూకరించారు.

డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్‌రావు

చేగుంట(తూప్రాన్‌): నీటిని పొదుపుగా వాడుకునేలా ప్రజలకు అవగాహన పెంపొందించాలని డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. చేగుంట ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ..ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు ఇంకిపోయే అవకాశం ఏర్పడుతుందని నీటిని పొదుపుగా వాడుకునేలా గ్రామాల్లోని ప్రజలకు అవగాహన పెంపొందించాలన్నారు. అన్ని గ్రామాల్లో ఇంకుడు గుంతలు, ఫాంపండ్‌లు నిర్మించుకుని వర్షం నీరు వృథా కాకుండా నీటి గుంతల్లోకి ఇంకిపోయేలా చూడాలని చెప్పారు. అనంతరం చేగుంటలో నిర్మిస్తున్న మహిళ భవనం, చిన్న శివునూర్‌లో రైతులు నిర్మించుకున్న ఫామ్‌పాండ్‌లను పరిశీలించారు. కార్యక్రమాల్లో ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఎంపీఓ ప్రకాశ్‌, ఐకేపీ ఎపీఎం దుర్గాప్రసాద్‌తోపాటు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

అల్లాదుర్గం(మెదక్‌): నీటి వనరులు పొదుపుగా వాడుతూ పంటలు సాగు చేయాలని మండల వ్యవసాయాధికారి నెలవంక సూచించారు. అల్లాదుర్గం రైతు వేదికలో ఖేత్‌ బచావో అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...రైతులు నేల పరీక్షల ఆధారంగా ఎరువులను వాడి పంట సాగు చేపడితే మంచి ఫలితాలు అధిక దిగుబడి పొందవచ్చన్నారు. పప్పుధాన్యాలు, నూనె గింజల పంటలను సాగు చేస్తే తక్కువ ఖర్చుతో అధిక లాభాలు వస్తాయని ఆమె తెలిపారు. సమతుల్య ఎరువుల వాడకం, ప్రకృతి వ్యవసాయం, పంటల అవశేషాల నిర్వహణ, నీటి సంరక్షణ, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఈఓ నవీన్‌, ఆత్మ సిబ్బంది కిరణ్‌, రైతులు పాల్గొన్నారు.

ఎస్పీని కలిసిన

ఏఎస్‌ఐ సంగయ్య

టేక్మాల్‌(మెదక్‌): టేక్మాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేసి ఏఎస్‌ఐగా పదోన్నతి పొందిన సంగయ్య గురువారం జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రావ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యత పత్రాన్ని అందించడంతోపాటు డ్రెస్‌కు స్టార్‌ను ధరించినట్లు తెలిపారు. తనకు పదోన్నతి కల్పించిన జిల్లా ఎస్పీకి, పదోన్నతికి సహకరించిన అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, టేక్మాల్‌ ఎస్‌ఐ అరవింద్‌కుమార్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement