మట్టి పరీక్షలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

మట్టి పరీక్షలు తప్పనిసరి

Oct 23 2026 7:18 AM | Updated on Oct 23 2026 7:18 AM

● జిల్లా వ్యవసాయాధికారి దేవ్‌కుమార్‌

● ఎల్లుపేటలో రైతులకు అవగాహన

టేక్మాల్‌(మెదక్‌)/పాపన్నపేట(మెదక్‌): ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేందుకు రైతులు యాసంగిలో ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి దేవ్‌కుమార్‌ స్పష్టం చేశారు. టేక్మాల్‌ మండలంలోని ఎల్లుపేట రైతువేదికలో సాగు భూమి సంరక్షణ అంశంపై రాష్ట్ర వ్యవసాయాశాఖమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌ పూర్తయిన తర్వాత రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వ్యవసాయ భూముల్లో రసాయన ఎరువులు, పురుగుమందులను అవసరానికి మించి వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటుందన్నారు. రైతులు తప్పనిసరిగా మట్టి పరీక్ష నమూనా చేసుకోవాలని వివరించారు. పంట కోసిన తర్వాత కొయ్యకాళ్లను తగల బెట్టకుండా కలియదున్నడం వలన భూసారం పెంచుకోవాలన్నారు. యాసంగిలో ఎల్‌నినో ప్రభావం వలన రైతులు ఆరుతడి పంటలైన జొన్నలు, శనగలు, తెల్ల కుసుమలు, పొద్దుతిరుగుడు, కూరగాయలు సాగు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ మార్కెటింగ్‌ ప్రసాద్‌రావు, ఏయంసీ వైస్‌ చైర్మన్‌ సత్య నారాయణ, మండల వ్యవసాయాధికారి రామ్‌ప్రసాద్‌, సర్పంచ్‌ మాధవీరెడ్డి, మండల ఎఫ్‌పీఓ సీఈఓ వెంకటేశం, ఏఈఓ సుుభాష్‌, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ ద్వారానే ఎరువులు

ఎరువులను ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ ద్వారా మాత్రమే విక్రయించాలని దేవ్‌కుమార్‌ స్పష్టం చేశారు. పాపన్నపేట మండలంలోని ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ప్రతీ డీలర్‌ రిజిస్టర్లు తప్పకుండా, స్టాక్‌ వివరాలు నమోదు చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఓ శ్రీనివాస్‌ రాజు,ఏఈఓ సంతోష్‌, ఆసిఫ్‌, డీలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement