దసరా కిక్‌ | - | Sakshi
Sakshi News home page

దసరా కిక్‌

Oct 22 2026 7:02 AM | Updated on Oct 22 2026 7:02 AM

ఒక్కరోజే రూ.13.43 కోట్ల మద్యం అమ్మకాలు

కొల్చారం(నర్సాపూర్‌): దసరా పండుగ సందర్భంగా మద్యం ఏరులై పారింది. పండుగకు ఒక్కరోజు ముందే జిల్లాలోని కొల్చారం మండలం చిన్న గణపురం ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌(ఐఎంఎల్‌)డిపో ద్వారా రూ.13,43,25,999ల మద్యం అమ్మకాలు జరిగాయి. డిపో పరిధిలో 118 మద్యం దుకాణాలు,17 బార్లున్నాయి. వీటన్నిటికీ చిన్నగణపూర్‌ డిపో ద్వారానే మద్యం సరఫరా అవుతుంది. ఈ నెల 19న మద్యం అమ్మకాలను చూస్తే వివిధ రకాల కంపెనీలకు చెందిన రూ.9,82,73,452 విలువైన ఐఎంఎల్‌ కేసులు 12,983, రూ.3,60,52,547 విలువైన 17,952 బీరు కేసులు అమ్ముడయ్యాయి. మొత్తంగా రెండూ కలిపి 30,935 కేసులు అమ్ముడయ్యాయి. అంతకుముందు రెండు రోజులైన 16,17వ తేదీల్లో 11,137 ఐఎంఎల్‌ కేసులు అమ్ముడుకాగా, బీరు 16,250 కేసులు అమ్ముడయ్యాయి. మొత్తంగా పై రెండు తేదీల్లో రూ.11,68,10,667 విలువైన మద్యం అమ్ముడైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement