పాడిపంటలతో సంతోషంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

పాడిపంటలతో సంతోషంగా ఉండాలి

Oct 22 2026 7:02 AM | Updated on Oct 22 2026 7:02 AM

పాడిపంటలతో సంతోషంగా ఉండాలి బీసీ‘ఏ’జోలికొస్తే ఖబర్దార్‌ పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం కృషి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం

దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే సునీతారెడ్డి

శివ్వంపేట(నర్సాపూర్‌): రైతులు పాడి పంటలు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆకాంక్షించారు. దసరా వేడుకలను వారి స్వగ్రామమైన గోమారంలో ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం సాయత్రం పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన జమ్మిపూజ, రావణదహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట బీఆర్‌ఎస్‌ నాయకులు చంద్రగౌడ్‌, హన్మంత్‌రెడ్డి, భిక్షపతిరెడ్డి, మైపాల్‌రెడ్డి, లక్ష్మణ్‌, ముత్యంరెడ్డి, తదితరులున్నారు.

రజక సంఘం నేతల హెచ్చరిక

మెదక్‌జోన్‌: బీసీ డీలో ఉన్న ముదిరాజ్‌లను బీసీ ఏలో చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను వెంటనే విరమించుకోవాలని మెదక్‌ రజక నేతలు హెచ్చరించారు. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీసీ డీలో ఉన్నటు వంటి ముదిరాజ్‌లను బీసీ ఏలోకి మారిస్తే రజక, మంగళి, వడ్డెర, బెస్త తదితర కులాల వారికి తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్రలు ఏ పార్టీ నేతలు చేసినా ఉపేక్షించమని, వారి ఇళ్లను ముట్టడించి రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో చౌదరి సంతోష్‌, శివ, పోచయ్య, నవీన్‌, విజయ్‌ తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్యే సంజీవరెడ్డి

పెద్దశంకరంపేట(మెదక్‌): పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దశంకరంపేట మండలం కమలాపూర్‌ గ్రామానికి చెందిన షేర్పల్లి దుర్గయ్యకు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఎల్‌ఓసీ రూ.5 లక్షల చెక్కును లబ్దిదారుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా పేదల కుటుంబాల సంక్షేమానికి కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ కుంట్ల రాములు తదితరులున్నారు.

ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణఖేడ్‌: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మహిళా సాధికారిత, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఖేడ్‌ మండలం పిప్రీలో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం, రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును బుధవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ..మహిళల అభ్యున్నతి, సంఘటిత శక్తిని మరింత బలోపేతం చేయడానికి మహిళా సమాఖ్య భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మౌలిక సదుపాయాలతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని అందువల్లే వాటికి ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఖేడ్‌ మున్సిపల్‌ చైర్మన్‌ నగేశ్‌ షెట్కార్‌, ఐకేపీ ఏపీఎం సాయిలు, ముఖ్యనాయకులు పండరీరెడ్డి, తాహెర్‌ అలీ, షారూక్‌ ఖాన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement