ఉన్నత చదువు! | - | Sakshi
Sakshi News home page

ఉన్నత చదువు!

Aug 5 2026 8:39 AM | Updated on Aug 5 2026 8:39 AM

ఉచిత కోచింగ్‌..

మెదక్‌జోన్‌: జిల్లావ్యాప్తంగా 19 కేజీబీవీలున్నాయి. వీటి ముఖ్య ఉద్దేశ్యం తల్లిదండ్రులు లేని అనాథ బాలికలను, లేదా తల్లి, లేక తండ్రిలేని బాలికలను, నిరుపేద విద్యార్థినులను వీటిల్లో చేర్పించి చదువులు చెప్పించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. వీటిలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు బోధన, వసతి సౌకర్యం కల్పించనున్నారు. కాగా, జిల్లాలో 19 పాఠశాలలకు గానూ 11 కేజీబీవీల్లో కాలేజీవరకు, మరో 9 కేజీబీవీల్లో 10వ తరగతి వరకు ఉంది. వీటి ఏర్పాటుతో పేద విద్యార్థినుల భవిష్యత్తుకు బంగారు బాటలు పడనున్నాయి.

ఉన్నత చదువుకు కోచింగ్‌..!

నిరుపేద విద్యార్థినులకు ఉన్నత చదువులను అందించాలనే దూరదృష్టితో ప్రభుత్వం జిల్లాలోని మూడు కేజీబీవీలను ఎంపిక చేసింది. ఇందులో మెదక్‌, నర్సాపూర్‌ మండలంలోని చిప్పల్‌తుర్తి, అల్లాదుర్గ్‌ కేజీబీవీలకు ఎంపిక చేశారు. మెదక్‌ కేజీబీవీలో ఐఐటీ, జేఈఈ, నర్సాపూర్‌ మండలం చిప్పల్‌తుర్తిలో గల కేజీబీవీలో నీట్‌, అల్లాదుర్గ్‌ కేజీబీవీలో క్లాట్‌(లా–కోర్స్‌)ల్లో చేరేందుకు ఎంట్రెన్స్‌ కోసం విద్యార్థినులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఒక్కో కేజీబీవీలో కోచింగ్‌ ఇచ్చేందుకు 4గురు ఫ్యాకల్టీల చొప్పున, మూడు కేజీబీవీల్లో మొత్తం 12 మంది బోధకుల(నిపుణులు)ను నియమించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గతేడాది ఈ పాఠశాలలను ఏర్పాటు చేసినప్పటికీ ఆన్‌లైన్‌ తరగతులు మాత్రమే నిర్వహించారు.

ఫ్యాకల్టీ నియామకం...!

ఐఐటీ, జేఈఈ, నీట్‌, క్లాట్‌ల శిక్షణ కోసం ప్రవేశ పరీక్ష రాసేందుకు ఉచితంగా శిక్షణ ఇచ్చే ఫ్యాకల్టీల కోసం సంబంధిత కస్తూర్భాగాంధీ విద్యాలయాల సిబ్బంది చర్యలు చేపట్టింది. కాగా, ప్రస్తుతం కేజీబీవీలో చదువుతున్న విద్యార్థినులకు ఓ పక్క రెగ్యులర్‌గా ఇంటర్‌ సిలబస్‌ బోధిస్తూనే ఉన్నత చదువుల కోసం ప్రత్యేకంగా శిక్షణనిచ్చేందుకు గానూ ఆయా సబ్జెక్టుల వారీగా బోధించే సిబ్బంది నియామకాల ఎంపికను కస్తూరా్భాగాంధీ సిబ్బందికే అప్పగించారు. త్వరలో వారిని నియమించ నున్నట్లు తెలిసింది. కాగా, ఈ కోచింగ్‌ తరగతులు వారంలో శని, ఆదివారాల్లో మాత్రమే సబ్జెక్టుకు గంట పాటు ఒక్కో సబ్జెక్టుకు వారంలో కేవలం 2 గంటలు మాత్రమే చెప్పనున్నారు. మొత్తం 12 మంది ఫ్యాకల్టీ అవసరం కాగా వారికి బోధించినందుకు గంటకు రూ.650 చొప్పున వారికి చెల్లించనున్నారు.

మెదక్‌లోని కేజీబీవీ పాఠశాల

టాపర్‌లకు ఉచిత ఫీజు!

కాగా, ఇంటర్‌లో టాప్‌ మార్కులు సాధించిన విద్యార్థినులకు ఫీజ్‌ సైతం ప్రభుత్వమే భరించనుంది. ఐఐటీ, జేఈఈ, నీట్‌, క్లాట్‌ల శిక్షణకు సంబంధించి ఎంట్రెన్స్‌ రాసేందుకు సైతం అధికంగానే ఫీజు ఉంటుందని, సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన బుక్స్‌ ఇప్పటికే కొనుగోలు చేయగా, ఆన్‌లైన్‌ తరగుతులు సైతం కొనసాగుతుండగా, త్వరలోనే ఆఫ్‌లైన్‌ తరగతులు కొనసాగనున్నాయి.

మా భూములు ఇవ్వడానికి సిద్ధమే

నిరుపేద విద్యార్థినులకు ఉన్నత చదువులు చెప్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీలద్వారా ప్రత్యేక కోచింగ్‌లు ఇప్పిస్తోంది. ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (ఐఓఈ)ల్లో భాగంగా ఐఐటీ,జేఈఈ,నీట్‌, క్లాట్‌లో చేరేందుకు ప్రత్యేకంగా బోధకులను ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

పేద విద్యార్థినులకు వరంగా కేజీబీవీలు

జిల్లాలో ఐఓఈలకు మూడు విద్యాలయాల ఎంపిక

ఐఐటీ,జేఈఈ,నీట్‌, క్లాట్‌ల శిక్షణ కోసం

త్వరలో 12 మంది బోధకుల ఏర్పాటు

త్వరలోనే నియమిస్తాం!

ప్రత్యేకంగా మెదక్‌, అల్లాదుర్గ్‌, నర్సాపూర్‌ మండలం చిప్పల్‌తుర్తి కేజీబీవీలలో చదివే విద్యార్థినులకు ఐఐటీ, జేఈఈ, నీట్‌, క్లాట్‌ల (లా–కోర్స్‌)లు చదివేందుకు గానూ ఎంట్రెన్స్‌లు రాసేందుకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తాం. ఇందుకోసం ఇప్పటికే ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభం కాగా త్వరలోనే బోధకులను నియమించి శిక్షణ ఇప్పిస్తాం.

–జగదీశ్వరీ, కేజీబీవీల కో –ఆర్డినేటర్‌, మెదక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement