ఎనగండ్ల మామిడి చెరువులోకి వచ్చి చేరిన వర్షపు నీరు
గత వారం రోజుల నుంచి కురుస్తోన్న వర్షాలతో చెరువులు కుంటల్లోకి నీరు వచ్చి జలకళను సంతరించుకుంటున్నాయి. పగలంతా పొడి వాతావరణం రాత్రి చిరుజల్లులతో ప్రారంభమై భారీ వర్షంగా మారుతోంది. సోమవారం రాత్రి గంట పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో వరి పొలం అచ్చుకట్ల నుంచి నీరు పొంగిపొర్లింది. అటు పత్తి పంటలో వర్షపు నీరు నిలిచి కనిపించింది. వర్షాలు అంతంతగానే ఉంటాయన్న తరుణంలో రోజులో ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కొల్చారం(నర్సాపూర్)


