యూరియా యాప్‌ తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

యూరియా యాప్‌ తొలగించాలి

Aug 5 2026 8:39 AM | Updated on Aug 5 2026 8:39 AM

చిన్నశంకరంపేట(మెదక్‌): రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న యూరియా యాప్‌ను తొలగించాలని చిన్నశంకరంపేట మండలంలోని సర్పంచ్‌లు డిమాండ్‌ చేశారు. చిన్నశంకరంపేట మండల ప్రత్యేకాధికారి వెంకటయ్య అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఎంపీపీ సాధారణ సమావేశంలో ఏఓ ప్రవీణ్‌ కుమార్‌ వ్యవసాయ సాగు, యూరియా లభ్యతపై వివరించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు నాగభూషణం, కృష్ణాగౌడ్‌, ప్రవీణ్‌కుమార్‌లు మాట్లాడుతూ...రైతులను ఇబ్బందులు పెడుత్ను యూరియా యాప్‌ను తొలగించి, నేరుగా రైతులకు యూరియా అందించాలన్నారు. ఇదే విషయంపై సర్పంచ్‌లు యాప్‌ను రద్దుచేసి నేరుగా యూరియా అందించాలని తీర్మానం చేశారు. చిన్నశంకరంపేట మండలంలోని గ్రామాలలో గుడిసెలులేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సర్వే నిర్వహించినట్లు ఎంపీడీఓ దామోదర్‌ తెలిపారు. రెండవ విడతలో పూరిగుడిసెలలో నివాసం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయని వివరించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ చంద్రశేఖర్‌ తదితరులు మాట్లాడుతూ..అద్దె ఇంట్లో ఉంటున్నవారికి ఇందిరమ్మ ఇళ్లు అందించాలన్నారు. రహదారులపైకి వస్తున్న కేజ్‌ విల్‌ ట్రాక్టర్లపై చర్యలు చేపట్టాలని సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి కోరారు. మట్టిమాఫియాపై చర్యలు చేపట్టాలని చిన్నశంకరంపేట సర్పంచ్‌ చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ దీప్లారాథోడ్‌, మిషన్‌భగీరథ, ఆరోగ్య, ఐసీడీఎస్‌ తదితర అధికారులు తమ శాఖల పరిధిలోని పనులను వివరించారు. సర్పంచ్‌లు మోహన్‌నాయక్‌, నాగరాజు, సంతోష, సిద్దిరాములు, నరేశ్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీపీ సమావేశంలో సర్పంచ్‌ల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement