మెదక్‌జోన్: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలోని అధికారులతో మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో వ్యక్తిగత, సా మాజిక, భూ వివాదాలు, మోసాలు, వేధింపులకు తదితర ఫిర్యాదులు వచ్చాయి. ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా పోలీసులను కలిసి ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు సూచించారు.
బీజేవైఎం జిల్లా
అధ్యక్షుడిగా శ్రీనివాస్‌గౌడ్
వెల్దుర్తి(తూప్రాన్): బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని ఎదులపల్లికి చెందిన కందనూరి శ్రీనివాస్‌గౌడ్ నియమితులయ్యారు. పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాస్‌గౌడ్ విద్యార్థి దశ నుంచే ఏబీవీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. విద్యార్థుల సమస్యలపై అనేక ఉద్యమాలు చేపట్టారు. కళాశాల అధ్యక్షుడి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు వివిధ హోదాల్లో పనిచేశారు. భారతీయ జనతా పార్టీ అనుబంధ విభాగాల్లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. ఈసందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, జిల్లాలో బీజేవైఎంను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు.
రాజ్యాంగ హక్కులు
కాపాడుకుందాం
మెదక్ కలెక్టరేట్: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న క్విట్ మోడీ, క్విట్ కార్పొరేట్ పేరుతో జైల్ భరో నిర్వహిస్తున్నట్లు ప్రజాసంఘాల నాయకులు తెలిపారు. సోమ వారం సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో కేవల్ కిషన్ భవన్‌లో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడివయ్య మాట్లాడుతూ.. మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతీ చర్య కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడేదిగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తేందుకు క్షేత్రస్థాయిలో సదస్సులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆయా సంఘాల నాయకులు మల్లేశం, కె. మల్లేశం, లచ్చాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మనువాద పార్టీలకు చోటులేదు : వెన్నెల
చిన్నశంకరంపేట(మెదక్): తెలంగాణలో మనువాద పార్టీలకు చోటులేదని తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్‌పర్సన్ వెన్నెల గద్దర్ అన్నారు. సోమవారం చిన్నశంకరంపేటలో ఆమె మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియతో బీజేపీ ఓట్ చోరీకి పాల్పడేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను వాడుకొని తెలంగాణలో పాగా వేయాలని చూస్తుందన్నా రు. బీఎల్‌ఓలు మీ ఇంటికి రాకుంటే మీరే వారి వద్దకు వెళ్లి వివరాలు అందించాలన్నారు. కాంగ్రెస్ బీఎల్‌ఏలు సైతం గ్రామాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీ కో ఆర్టినేటర్ ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోహన్‌నాయక్, సర్పంచ్‌లు ప్రవీణ్‌కుమార్, నవీన్‌కుమార్, నర్సింహులు, అక్బర్ పాల్గొన్నారు.
‘జీఓ 12ను రద్దు చేయాలి’
సంగారెడ్డి ఎడ్యుకేషన్: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్‌ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ కార్యా లయం ఎదుట ధర్నా నిర్వహించారు.


