పరిశ్రమను మూసి వేయాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమను మూసి వేయాల్సిందే..

Jul 21 2026 7:22 AM | Updated on Jul 21 2026 7:22 AM

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రజల ప్రాణాలకు సంకటంగా మారిన పరిశ్రమను తొలగించకుంటే జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రతాప్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమ వారం మనోహరాబాద్‌ మండలం చెట్ల గౌరారం, రంగాయపల్లి గ్రామాల ప్రజలతో కలిసి కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్‌లోకి చొ చ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకోవడంతో ప్రధాన గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు తోడేస్తున్న కాలుష్య కారక పరిశ్రమను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. పరిశ్రమను త్వరగా మూసివేసి ఆ రెండు గ్రామాల ప్రజలను కాపాడాలన్నారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంపై గ్రామంలో యువకులు ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడుతున్నారని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీర్డీఓ అంబదాస్‌ రాజేశ్వర్‌కు అందజేశారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే కలెక్టరేట్‌ ఎదుట వంటా వార్పు చేపడుతామన్నారు. కార్యక్రమంలో మెదక్‌ ఏఎంసీ మాజీ చైర్మన్‌ కృష్ణారెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, మాజీ కౌన్సిలర్‌ ప్రభురెడ్డితో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రెండు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement