మెదక్‌ అభివృద్ధికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

మెదక్‌ అభివృద్ధికి పెద్దపీట

Jul 15 2026 12:05 PM | Updated on Jul 15 2026 12:05 PM

ఎమ్మెల్యే రోహిత్‌రావు

మెదక్‌ కలెక్టరేట్‌: నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే రోహిత్‌రావు తెలిపారు. మంగళవారం పట్టణంలోని పలు వార్డుల్లో రూ.2.93 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. మెదక్‌ పట్టణ రూపురేఖలు మారుతున్నాయన్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సీసీ రోడ్లు, మురికి కాల్వలు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే తన ధ్యేయం అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు ప్రారంభించి మెదక్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా నిలబెడతానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధిక, వైస్‌చైర్మన్‌ నరేశ్‌గౌడ్‌, కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement