అదనపు కలెక్టర్ నగేశ్
మెదక్ కలెక్టరేట్: టెండర్లు పొందిన గుత్తేదారులు విద్యార్థులకు నాణ్యమైన సరుకులు, పండ్లు అందించాలని, నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తే బ్లాక్‌లిస్టులో పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ నగేశ్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని 19 కేజీబీవీలు, 6 టీజీఎస్‌ఆర్(బాలికల), అర్బన్ రెసిడెన్సియల్ స్కూళ్లు, హాస్టళ్లకు సరుకుల టెండర్లు జరిగాయి. ఈసందర్భంగా స్కూళ్లు, హాస్టళ్లకు చికెన్, మటన్, కూరగాయలు, పండ్ల సరఫరాకు లాటరీ పద్ధతిన టెండర్‌దారులను ఎంపిక చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టెండర్ల కోడ్ చేసిన గుత్తేదారులు నాణ్యతను విధిగా పాటించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఏఎంఓ సుదర్శన్‌మూర్తి, వసతి గృహ సంక్షేమ అధికారులు, ప్రిన్సిపాల్స్, తదితరులు పాల్గొన్నారు.


