
అవే బారులు.. అవే బాధలు
రామాయంపేట(మెదక్)/చిలప్‌చెడ్(నర్సాపూర్)/శివ్వంపేట/చేగుంట(తూప్రాన్): జిల్లాలో యూరి యా కోసం రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిద్ర లేచింది మొదలు అన్ని పనులు మానుకొని బారులు తీరుతున్నారు. టోకెన్ల కోసం నిరసనలు, తోపులాటకు దిగుతున్నారు. వందలాది మంది సహకార సంఘాల వద్ద బారులు తీరుతూ పాస్ పుస్తకాలు, పాదరక్షలను వరుసలో ఉంచుతున్నారు. వస్తున్న కొద్దిపాటి స్టాక్‌ను వ్యవసాయశాఖ అధికారులు పోలీసుల సహాయంతో రైతులకు పంపిణీ చేస్తున్నారు. దొరకని వారు అక్కడక్కడ రోడ్లపై ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పొద్దంతా పడిగాపులు కాస్తే తమకు ఒక్క సంచి కూడా లభించడం లేదని వాపోతున్నారు. నర్సాపూర్, రామాయంపేట, శివ్వంపేట, కౌడిపల్లి, చిన్నశంకరంపేట, చిలప్‌చెడ్, చేగుంటలోని రైతు వేదిక వద్ద ఉదయం నుంచే వందలాది మంది రైతులు పాస్ పుస్తకాలతో బారులు తీరారు. ఓపిక నశించిన పలువురు నర్సాపూర్, రామాయంపేట మండలం కోనాపూర్‌లో రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డుపైకి చేరుకొని నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు కల్పించుకొని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. రామాయంపేటలోని ఆగ్రో రైతు సేవా కేంద్రంలో యూ రియా బస్తాలకు బదులుగా ఇతర మందులు లింక్ చేసి అమ్మడంతో రైతుల ఫిర్యాదు మేరకు వ్యవసాయ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల రామాయంపేటలో మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి ఆగ్రో సేవా కేంద్రం ఎదుట రైతులతో కలిసి ఆందోళన నిర్వహించారు. దుకాణంలో దాచి ఉంచిన యూరియా బస్తాలను అధికారుల సమక్షంలో రైతులకు పంచారు. తాజాగా సోమవారం సహకార సంఘానికి 900 వందల యూరియా బస్తాలు రాగా, తెల్లవారుజామునే వేలాది రైతులు తరలివచ్చారు. జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఈనెలాఖరులోగా స్టాక్ వస్తుందని, రైతులు ముందస్తుగా యూరియా తీసుకొని స్టాక్ పెట్టుకోవద్దని సూచించారు.
యూరియా కోసం అన్నదాతల పడిగాపులు పలుచోట్ల ఆందోళనలు, తోపులాటలు

అవే బారులు.. అవే బాధలు

అవే బారులు.. అవే బాధలు

అవే బారులు.. అవే బాధలు